తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆది కొత్త చిత్రం 'అమరన్‌' ప్రారంభం - ఎస్‌.బలవీర్‌

ఎస్​.బలవీర్​ దర్శకత్వంలో ఆది సాయికుమార్​ హీరోగా కొత్త సినిమా ప్రారభమైంది. శనివారం పూజా కార్యక్రమంతో ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఫొటోలను చిత్రబృందం ప్రకటించింది.

Amaran
అమరన్‌

By

Published : Apr 24, 2021, 11:01 PM IST

Updated : Apr 25, 2021, 6:02 AM IST

ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా ఎస్‌.బలవీర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'అమరన్‌: ఇన్‌ ది సిటీ-చాప్టర్‌ 1' అనేది చిత్ర ఉపశీర్షిక. అవికా గౌర్‌ కథానాయిక. శనివారం పూజా కార్యక్రమంతో ఈ సినిమాను లాంఛనంగా మొదలు పెట్టారు. తొలి సన్నివేశానికి హీరోహీరోయిన్లపై సాయికుమార్‌ క్లాప్‌నివ్వగా, జెమినీ మూర్తి కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. వీర‌భ‌ద్రం చౌద‌రి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. జెమినీ స్టూడియో సమర్పణలో ఎస్‌వీఆర్‌ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది.

ఇందులో ఆదిత్య ఓం, కృష్ణుడు, మనోజ్‌ నందన్‌, పవిత్రా లోకేష్‌, వీర్‌ శంకర్‌, మధుమణి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. కృష్ణ చైతన్య సంగీత స్వరాలు అందిస్తుండగా ఎం.సతీష్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. ఫాంటసీ ఎలిమెంట్స్‌తో పాటు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనుంది. ఇందులో ఆది పాత్ర గతంలో ఎన్నడూ కనిపించిన విధంగా కొత్తగా ఉంటుందట. విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కు ఎక్కువ ప్రాధాన్య‌ం ఇస్తూ భారీ బ‌డ్జెట్‌తో చిత్రాన్ని రూపొందిస్తున్నారు నిర్మాత‌లు.

Last Updated : Apr 25, 2021, 6:02 AM IST

ABOUT THE AUTHOR

...view details