యువ కథానాయకుడు ఆది సాయికుమార్ జోరు పెంచాడు. ఒకేసారి మూడు చిత్రాల్ని పట్టాలెక్కించేస్తున్నాడు. ఇటీవలే 'ఆపరేషన్ గోల్డ్‌ఫిష్' చిత్రంతో అలరించిన ఆది తన పుట్టిన రోజు కానుకగా అభిమానులకు ట్రిపుల్ ధమాకా ఇచ్చాడు.
అవేంటంటే.. శ్రీనివాస్ నాయుడు దర్శకత్వంలో 'శశి' అనే చిత్రం చేస్తున్నాడు. దీనికి సంబంధించి ఆది ఫస్ట్‌లుక్ విడుదల చేసింది చిత్రబృందం. ఈ పోస్టర్‌లో రెండు విభిన్న కోణాల్లో కనిపిస్తున్నాడు ఆది. మైక్ పట్టుకుని చిరు నవ్వు చిందిస్తూ పాడుతుండగా.. పక్కనే గుబురు గడ్డంతో పొడవాటి జుత్తుతో గంభీరంగా అరుస్తూ ఆసక్తి పెంచుతున్నాడు. ఈ చిత్రంలో కథానాయికగా సురభి ఎంపికైంది. హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై ఈ చిత్రం నిర్మితమవుతుంది.