టాలీవుడ్ యువ కథానాయకుడు ఆది సాయి కుమార్, వేదిక హీరోహీరోయిన్లుగా కొత్త చిత్రం ప్రారంభమైంది. తెలుగు, తమిళంలో రూపొందనున్న ఈ సినిమాతో కార్తీక్ విఘ్నేష్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మార్చి 25 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని చిత్రబృందం ప్రకటించింది.
ఆది కొత్త చిత్రం ప్రారంభం - vedika
ప్రేమకావాలి, లవ్లీ చిత్రాల్లో హీరోగా నటించిన ఆది సాయి కుమార్ కొత్త సినిమా ప్రారంభించాడు. హీరోయిన్గా వేదిక నటిస్తోంది.
వేదిక, ఆది
ప్రస్తుతం 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్'లో పోలీస్‌గా నటించాడీ హీరో. త్వరలో విడుదలకానున్న ఈ చిత్రంలో రచయిత అబ్బూరి రవి... ఘాజీబాబాగా ప్రతినాయక పాత్రలో నటిస్తున్నాడు.