వెండితెరపై నటుడు అని పిలిపించుకోవాలంటే నవరసాలు ముఖంలో పలికించాలి అంటారు సినీ పెద్దలు. అందులోను ఒక ప్రముఖ దర్శకుడి కొడుకు అవటం వలన కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, కీలక పాత్రలో, ప్రత్యేక పాత్రలో ఇలా ఒకేసారి విభిన్న పాత్రలు పోషిస్తు కథానాయకుడిగాను, నటుడిగానూ గుర్తింపు పొందాడు ఆది పినిశెట్టి. 'రంగస్థలం'లో రామ్‌చరణ్‌కి అన్నగా నటించి ఆ సినిమా విజయంలో ఎంతటి కీలక పాత్ర పోషించాడో చెప్పనవసరం లేదు. తెలుగులో భారీ బడ్జెట్ చిత్రాల్లో ప్రతినాయకుడిగా కనిపిస్తూనే తమిళంలో కథానాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆది.
ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడే ఆది పినిశెట్టి. తన తండ్రి పెద్ద దర్శకుడే అయినప్పటికి ఆయన సహాయం తీసుకోకుండా తనే సొంతంగా సినిమాల్లోకి వచ్చాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో తెలుగులో నటుడిగా, తమిళంలో కథానాయకుడిగా ప్రయాణం కొనసాగిస్తున్నాడు. ఈరోజు ఆది పినిశెట్టి పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఆది నటిస్తోన్న కొత్త సినిమాలు 'క్లాప్', 'పార్ట్నర్' కీర్తి సురేష్ నాయికగా చేస్తున మరో సినిమా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త పోస్టర్‌లను విడుదల చేశాయి. ఈ కొత్త లుక్‌లు అభిమానులని ఆకట్టుకుంటున్నాయి.