తమిళ సినిమా నిర్మాత తై శరవణన్.. అమ్మపై ప్రేమ చాటుకున్నారు. గతేడాది ఆమె అకస్మాత్తుగా మరణించడం వల్ల బాధపడ్డారు. కానీ ఆమె జ్ఞాపకార్ధం స్మారక చిహ్నాన్ని నిర్మించి, తన ప్రేమను చాటుకున్నారు. ఇప్పుడా విషయం గురించి కోలీవుడ్లో అందరూ మాట్లాడుకుంటున్నారు.
దుండిగల్ జిల్లాలోని తన సొంతూరు ఒట్టన్చత్రమ్లో ఈ స్మృతి చిహ్నాని కట్టించారు నిర్మాత తై శరవణన్. ఈయన తమిళంలో 'అదలల్ కాదల్ సైవీర్', 'విల్లంబు', 'కెన్నడీ క్లబ్', 'మావీరన్ కిట్టు' తదితర సినిమాలు నిర్మించి గుర్తింపు తెచ్చుకున్నారు.