తెలంగాణ

telangana

ETV Bharat / sitara

జింగిల్​ బెల్స్​కు కథక్​ జోడించిన అదాశర్మ - కథక్​

నటి అదా శర్మ సామాజిక మాధ్యమాల్లో చాలా చురుగ్గా ఉంటుంది. తను చేసే ప్రతి విన్యాసాన్ని, సాహసాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసి తన అభిమానులను మురిపిస్తుంది. తాజాగా చేసిన ఆమె చేసిన పోస్టు వైరల్​ అవుతోంది.

Aadha Sharma-Kathak dance-christmas
జింగిల్​ బెల్స్​కు కథక్​ జోడించిన అదాశర్మ

By

Published : Dec 25, 2019, 9:49 PM IST

క్రిస్మస్‌ పండుగను పురష్కరించుకొని.. ప్రముఖ సాంగ్ జింగిల్‌ బెల్స్‌ పాటకు కథక్‌ నృత్యం చేస్తూ సందడి చేసింది అదా శర్మ. తను నృత్యం చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​ అవుతోంది.


"క్రిస్మస్‌ కోసం మీకు ఏమీ కావాలి? నేను శాంటా క్లాజ్‌ని కాదు. కానీ మీకోసం నేను చేయవలసింది ఏమైనా ఉంటే చేస్తాను. అందరికీ ఇండియన్‌ స్టైయిల్‌ జింగిల్‌ బెల్స్‌ మేరీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు" - అదా శర్మ ఇన్ స్టా పోస్టు.

అదా ప్రస్తుతం ‘'మ్యాన్‌ టు మ్యాన్‌' అనే చిత్రంలో నటిస్తోంది. ఇటీవలే 'కమాండో-3' చిత్రంలో విద్యుత్‌ జమ్వాల్‌ సరసన భావనా రెడ్డి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.

ఇదీ చదవండి:- రౌడీ హీరోపై మనసు పారేసుకున్న జాహ్నవి

ABOUT THE AUTHOR

...view details