తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆచార్య' కోసం ప్రత్యేకంగా ఓ ఊరు - రామ్ చరణ్

చిరంజీవి నటిస్తోన్న ఆచార్య సినిమా కోసం ప్రత్యేకంగా ఓ ఊరిని సృష్టించింది చిత్ర యూనిట్. దాదాపు 16 ఎకరాలకు పైగా ఈ ఊరిని నిర్మించినట్లు సమాచారం.

Chiru
'ఆచార్య' కోసం ప్రత్యేకంగా ఓ ఊరు

By

Published : Dec 4, 2020, 8:41 AM IST

కథానాయకుడు చిరంజీవి కోసం ఓ పెద్ద ఊరిని సృష్టించింది ఆచార్య బృందం. ఇప్పుడా ఊరిలోనే చిరుపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు దర్శకుడు కొరటాల శివ. చిరంజీవి నటిస్తున్న 152వ చిత్రమిది. రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాజల్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పుడీ చిత్రం కోసమే హైదరాబాద్ శివార్లలో... ఓ పెద్ద ఊరిని సృష్టించిందట చిత్రబృందం. దాదాపు 16 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఊరి కోసం రూ. 25 కోట్ల వరకూ ఖర్చు చేశారని సమాచారం.

ఆ ఊరిలో ఒక భారీ దేవాలయంతో పాటు ఓ యజ్ఞశాల, కొన్ని సెట్లు నిర్మించారని తెలిసింది. ప్రస్తుతం ఇందులోనే చిరుతో పాటు మిగతా ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.

సినిమాలోని అత్యధిక భాగం ఈ ఊరిలోనే చిత్రీకరణ జరుపుతోందని సమాచారం. ఈ చిత్రంలో రామ్​చరణ్ కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఆ పాత్ర కోసం చరణ్ వచ్చే ఏడాది జనవరిలో సెట్స్​లోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో నేటినుంచి తెరుచుకోనున్న సినిమా థియేటర్లు

ABOUT THE AUTHOR

...view details