స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, హీరో విజయ్ దేవరకొండ మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో తన రౌడీ బ్రాండ్ దుస్తులను బహుమతిగా పంపి బన్నీని సర్ప్రైజ్ చేశారు విజయ్. ఇప్పుడు మరోసారి అలానే గిఫ్ట్ ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నారు. రౌడీ హీరోకు కృతజ్ఞతలు చెబుతూ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఆ ఫొటోను పోస్ట్ చేశారు బన్నీ. ఈ బహుమతిలో రౌడీవేర్ టీషర్ట్, ట్రాక్, డిజైనర్ మాస్క్‌లు ఉన్నాయి.
బన్నీకి మరోసారి విజయ్ గిఫ్ట్.. ఈసారి ఏంటంటే?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరోసారి సర్ప్రైజ్ చేశారు. అతడి సొంత బ్రాండ్ 'రౌడీ వేర్' దుస్తులను బన్నీకి కానుకగా పంపించారు.
విజయ్ దేవరకొండ
స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'ఫైటర్'(వర్కింగ్ టైటిల్)లో నటిస్తున్నారు విజయ్ దేవరకొండ. అనన్య పాండే హీరోయిన్. పాన్ ఇండియా కథతో తెరకెక్కిస్తున్నారు. దీంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరోవైపు బన్నీ, సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమా చేస్తున్నారు. కరోనా లాక్డౌన్ వల్ల ఈ సినిమాల షూటింగ్‌లు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి.
ఇదీ చూడండి బాలయ్య-బోయపాటి సినిమాలో మీనా?