పవర్ స్టార్ పవవ్ కల్యాణ్ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. రాజకీయాల వల్ల కొంతకాలం సినిమాలకు విరామం ప్రకటించిన పవన్.. మళ్లీ పునరాగమనం చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించాడు. వరుసగా రెండు కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందులో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేస్తోన్న 'పింక్' రీమేక్ 'వకీల్ సాబ్' షూటింగ్ దాదాపు పూర్తయింది.
పవన్ బర్త్‌డేకు సర్ప్రైజ్ సిద్ధం.. దర్శకుడి ట్వీట్ - వకీల్ సాబ్ అప్డేట్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'వకీల్ సాబ్'. ఈ సినిమా నుంచి సర్ప్రైజ్ ఇచ్చేందుకు చిత్రబృందం సిద్ధమైంది. పవన్ పుట్టినరోజైన సెప్టెంబర్ 2న ఈ సర్ప్రైజ్ విడుదల చేస్తామని దర్శకుడు వేణు తెలిపాడు.
క్రిష్ దర్శకత్వంలోనూ పవన్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన సమయంలోనే కరోనా మహమ్మారి విజృంభించింది. దీంతో చిత్రీకరణలన్నీ నిలిచిపోయాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇప్పటికే 'వకీల్ సాబ్' ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కానీ కరోనా వల్ల అభిమానులకు నిరాశే ఎదురైంది. ఫలితంగా సినిమా విడుదలేమో కానీ.. పవన్ చిత్రాల నుంచి చిన్న అప్డేట్ వచ్చినా చాలు అనుకుంటున్నారు అభిమానులు. అందుకు సమయం ఆసన్నమైంది.
సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా 'వకీల్ సాబ్' చిత్రం నుంచి సర్ప్రైజ్ ఇస్తున్నట్లు దర్శకుడు వేణు శ్రీరామ్ తెలిపాడు. ట్విట్టర్ వేదికగా అందుకు సంబంధించిన ఓ ట్వీట్ చేశాడు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం నుంచి కూడా ఏదో ఒక అప్డేట్ వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.