బాలీవుడ్‌లో డ్యాన్స్‌లతో పాటు యాక్షన్ సన్నివేశాల్లోనూ అదరగొట్టే కథానాయకుల్లో హృతిక్ రోషన్ ఒకరు. అతడు ప్రేమకథలతో పాటు, సూపర్ హీరోలాంటి యాక్షన్ చిత్రాల్లోను నటించి మెప్పించాడు. ఇప్పటివరకు హృతిక్ 'క్రిష్' సీక్వెల్ చిత్రాల్లో నటించి అలరించాడు. ప్రస్తుతం 'క్రిష్ 4' సినిమాకు దర్శకుడు రాకేష్ రోషన్ స్క్రిప్టును సిద్ధం చేసే పనిలో ఉన్నారట. త్వరలోనే చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు కసరత్తులు చేస్తుందట చిత్రబృందం. ఇదే విషయాన్ని హృతిక్ తండ్రి దర్శకుడు రాకేష్ రోషన్ ఓ సమయంలో స్వయంగా చెప్పారు.
అయితే ఇందులో ప్రతినాయకుడి పాత్రలో ఎవర్ని తీసుకోవాలనే అంశంపై చర్చలు జరిగాయట. అంతేకాదు 'క్రిష్ 4' చిత్రంలో విలన్ పాత్రకు దక్షిణాదికి చెందిన కథానాయకుడిని తీసుకోవాలని చిత్రబృందం ఆలోచిస్తుందట. పలువురు బాలీవుడ్ తారలు ఇప్పటికే తెలుగు, తమిళంలో వచ్చే చిత్రాల్లో కొన్ని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.