తన పాటలతో ఆబాలగోపాలాన్ని అలరించిన గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతిని తెలుగు సినీపరిశ్రమ ఘనంగా నిర్వహించబోతుంది. జూన్ 4న ఎస్పీబీ 75వ పుట్టినరోజు సందర్భంగా చిత్రసీమ ఆయనకు స్వరనీరాజనం అర్పించబోతుంది. ఆ రోజంతా సినీలోకం బాలు నామాన్ని స్మరించబోతుంది.
స్వరబ్రహ్మ డైమండ్ జూబ్లీ వేడుకలను 12 గంటలపాటు ఆన్లైన్ వేదికగా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ కార్యక్రమంలో కథానాయకులు, కథానాయికలు, దర్శక నిర్మాతలు, సంగీత దర్శకులు, గాయనీ గాయకులు, గేయ రచయితలందరూ పాల్గొనబోతున్నారు.