తెలంగాణ

telangana

ETV Bharat / sitara

గోవాలో క్రాక్.. నితిన్​ సినిమా షూటింగ్​ షురూ! - ఆరాట్టు

కొత్త సినిమా షూటింగ్​లో బిజీ అయిపోయారు ప్రముఖ నటులు. రవితేజ క్రాక్​ సినిమా చిత్రీకరణ గోవాలో జరుగుతోంది. మరోవైపు తను నటిస్తోన్న అంధాదున్​ రీమేక్ సినిమా షూటింగ్​ మొదలైందంటూ నితిన్ ట్వీట్​ చేశాడు. 'ఆరాట్టు' సినిమా ఫస్ట్​ లుక్ పోస్టర్​ను షేర్​ చేశాడు మలయాళ నటుడు మోహన్​లాల్.

movie stars
గోవాలో క్రాక్... నితిన్​ సినిమా షూటింగ్​ షురూ!

By

Published : Dec 6, 2020, 8:02 PM IST

లాక్​డౌన్​ తర్వాత నెమ్మదిగా సినిమా షూటింగ్స్​ మొదలయ్యాయి. ప్రముఖ నటులందరూ తమ కొత్త సినిమా షూటింగ్​లో బిజీ అయిపోతున్నారు. ఈ నేపథ్యంలో తమ కొత్త సినిమా కబుర్లను సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకుంటున్నారు.

>క్రాక్​ సినిమా తుది దశ చిత్రీకరణ గోవాలో జరుగుతోంది. సినిమాలోని ఓ పాట షూటింగ్​లో భాగంగా రవితేజ, శ్రుతిహాసన్​ చిందులేశారు. ఈ సందర్భంగా షూటింగ్​ సంబంధించిన ఫొటోలను షేర్​ చేశాడు మాస్ మహా​రాజా.

గోవాలో 'క్రాక్'​ షూటింగ్ షురూ

>మలయాళ సూపర్ స్టార్ మోహన్​లాల్​ 'ఆరాట్టు' సినిమా షూటింగ్​ కోసం సన్నద్ధమవుతున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన మొదటి లుక్ పోస్టర్​ రిలీజ్ చేశారు.

మోహన్​లాల్

>నితిన్, గాంధీ మేర్లపాక కాంబినేషన్​లో అంధాదున్ తెలుగు రీమేక్ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా చిత్రీకరణకు సంబంధించిన ఫొటో షేర్​ చేశారు నటుడు నితిన్. ఇందులో తమన్నా, నభా నటేష్ నటిస్తున్నట్లు పేర్కొన్నారు. సగర్​మహటి ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.

అంధాదున్​ రీమేక్​గా వస్తోన్న నితిన్ సినిమా

>బాలీవుడ్ నటి జాహ్నవి కపూర్​ ఇన్​స్టా వేదికగా ఓ డాన్స్​ వీడియోని షేర్​ చేశారు. ఈ వీడియోకి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇలాంటి డాన్స్​ వీడియోలు మరిన్ని పోస్ట్​ చేయాలని ఫాన్స్​ కోరుతున్నారు.

>బాలీవుడ్ నటి అమీషా పటేల్ ఓ స్మార్ట్​ వీడియోని పోస్ట్ చేసింది. సన్​షైన్​ అని ఓ కామెంట్​ జోడించిన ఈ వీడియోకి నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.

ఇదీ చదవండి:'పద్మావత్'​లో ప్రభాస్ అందుకే నటించలేదు!

ABOUT THE AUTHOR

...view details