'సార్పట్ట' సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆర్య.. ప్రశంసలు దక్కించుకుంటున్నారు. ఈ మధ్యే అతడి భార్య సాయేషా సైగల్.. ఆడపిల్లకు జన్మనివ్వడం వల్ల ఆర్య ఆనందం రెట్టింపు అయింది. ఈ సమయంలో అతడిపై జర్మనీకి చెందిన ఓ మహిళ కేసు పెట్టడం చర్చనీయాంశమైంది.
తనను పెళ్లి చేసుకుంటానని చెప్పిన ఆర్య.. రూ.70 లక్షలు తీసుకున్నాడని జర్మనీకి చెందిన విజ్డా ఆన్లైన్లో ఫిర్యాదు చేసింది. తామిద్దరి వాట్సాప్ చాట్‌ను కూడా సమర్పించింది. ఆర్య తర్వాతి సినిమాలు విడుదల కాకుండా నిషేధం విధించాలని ఆమె కోరింది.