తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆర్​ఆర్​ఆర్' సినిమాకు కొత్త విడుదల తేదీ? - rey stevenson-olivia morris-alison doody

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'ఆర్​ఆర్ఆర్' విడుదల తేదీ మారిందట. వచ్చే ఏడాది గాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 2న రానుందని సమాచారం.

A fresh release date for RRR
'ఆర్​ఆర్​ఆర్' సినిమాకు కొత్త విడుదల తేదీ

By

Published : Nov 26, 2019, 6:41 PM IST

స్టార్ హీరోలు రామ్​చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్న మల్టీస్టారర్ 'ఆర్​ఆర్ఆర్'. తారక్​ సరసన ఒలీవియా మోరిస్ హీరోయిన్​గా.. రే స్టీవెన్​సన్, అలిసన్ డూడీలు ప్రతినాయక పాత్రలు పోషిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. దాదాపు 10 భాషల్లో విడుదల చేయనున్నట్లు చెప్పింది. అయితే ఆ పోస్టర్​లపైనా విడుదల తేదీని మాత్రం రాయలేదు. ఈ కారణంగా అభిమానుల మదిలో సందేహాలు మొదలయ్యాయి. ముందే చెప్పినట్లు 2020 జూలై 31న వస్తుందా? రాదా? అని చర్చించుకుంటున్నారు.

రే స్టీవెన్​సన్-ఒలివీయా మోరిస్-అలిసన్ డూడీ

తాజాగా 'ఆర్ఆర్ఆర్' విడుదల తేదీ ఇదేనంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. గాంధీ జయంతి సందర్భంగా వచ్చే ఏడాది అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుందట ఈ చిత్రం. దీనిపై స్పష్టత రావాల్సిన అవసరముంది.

ఈ చిత్రంలో చరణ్​ పక్కన అలియా భట్ హీరోయిన్. అజయ్ దేవగణ్, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీత దర్శకుడు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు. డివివి దానయ్య నిర్మాత.

ఇది చదవండి: ఒక్క రోజులోనే రికార్డు సెట్​ చేసిన 'ఆర్ఆర్​ఆర్' భామ

ABOUT THE AUTHOR

...view details