తనను(sanjjanaa galrani news) ఓలా క్యాబ్ డ్రైవరు అపహరించాడని ఆరోపణలు చేసిన నటి సంజనా గల్రానిపై బాధిత డ్రైవరు సుసైయ్ రాజరాజేశ్వరినగర పోలీసు ఠాణాలో బుధవారం ఫిర్యాదు చేయడం వల్ల కథ మలుపు తిరిగింది.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. ఆ వివరాల్లోకి ఓ సారి తొంగిచూస్తే.. ఇందిరానగర నుంచి కెంగేరి వెళ్లేందుకు సంజన మంగళవారం రాత్రి క్యాబ్ బుక్ చేసుకున్నారు. ఏసీ వేయాలని డ్రైవరుకు ఆమె సూచించారు. చోదకుడు ఏసీ వేసేలోగా సంజన తిట్ల పురాణాన్ని మొదలుపెట్టారు. అక్కడికక్కడ తనను క్యాబ్ డ్రైవరు అపహరించాడని ఒక సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టారు. తనను ఎక్కడకు తీసుకు వెళుతున్నావంటూ డ్రైవరును బెదిరించింది. మీరు బుక్ చేసిన లొకేషన్‌కే వెళుతున్నామని చెప్పినా వినకుండా ఆమె తిట్ల వర్షం కురిపించింది. గమ్యస్థానం వచ్చిన అనంతరం నా భర్త వస్తాడని, నీ అంతు చూస్తాడని బెదిరించింది. ఆమె ఎందుకు అలా మాట్లాడుతుందో అర్థం కాని సుసైయ్.. మౌనాన్ని ఆశ్రయించాడు. అంతటితో ఆగకుండా పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి కారు డ్రైవరుపై ఫిర్యాదు చేసింది. ఈ ఘటన మొత్తాన్ని డ్రైవరు తన చరవాణిలో రికార్డు చేసి.. పోలీసులకు వివరించారు. అతని ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.