తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సల్మాన్ ఫామ్​హౌస్​లోని జాక్వెలిన్ వీడియో - జాక్వెలిన్ వార్తలు

సల్మాన్​కు చెందిన పాన్​వెల్ ఫామ్​హౌస్​లో ఉన్న నటి జాక్వెలిన్.. లాక్​డౌన్​ వేళ అక్కడ తన రోజువారీ జీవితం ఎలా సాగుతుందో చూపిస్తూ ఓ వీడియోను చిత్రీకరించి, ఇన్​స్టాలో పోస్ట్ చేసింది.

సల్మాన్ ఫామ్​హౌస్​లోని జాక్వెలిన్ వీడియో
జాక్వెలిన్ ఫెర్నాండెజ్

By

Published : May 8, 2020, 1:35 PM IST

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. స్టార్ హీరో సల్మాన్​ఖాన్​కు చెందిన ఫామ్​హౌస్​లో ప్రస్తుతం ఉంది. ఇటీవల కాలంలో అందుకు సంబంధించిన ఫొటోలు పోస్ట్ చేస్తున్న ఈ భామ.. అక్కడ తన రోజువారీ జీవితం ఎలా గడుస్తుంది అనే వీడియోను అభిమానులతో పంచుకుంది.

ఇందులో భాగంగా జాక్వెలిన్.. జంతువులతో ఆడుకోవడం, కొబ్బరిచెట్టు ఎక్కేందుకు ప్రయత్నించడం, గుర్రానికి స్నానం చేయించి, దానిపై స్వారీ చేసింది.

ఇటీవలే తన ఫామ్​హౌస్​కు సమీపంలోని గ్రామాలకు రేషన్ సరకులను ట్రాక్టర్లు, ఎడ్లబళ్లపై సరఫరా చేశాడు సల్మాన్. ఈ కార్యక్రమంలో జాక్వెలిన్ పాలుపంచుకుని, అతడికి సాయం చేసింది.

ABOUT THE AUTHOR

...view details