సినిమాలను ఓటీటీ, థియేటర్‌లలో ఎక్కడ విడుదల చేయాలనే విషయంలో ఎటువంటి చర్చకు తావు లేదని బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తెలిపాడు. ఏ మాధ్యమంలో విడుదల చేసినా సినిమా అభిమానుల మెప్పు పొందాలన్నాడు. బచ్చన్ నటించిన 'బిగ్‌బుల్' చిత్రం ఓటీటీ వేదికగా విడుదల కాబోతుంది. ఓటీటీలలో సినిమాలు విడుదల చేయడం గురించి తాము ఏనాడు చర్చించుకోలేదని పేర్కొన్నాడు.
'కరోనా ఉన్నంత వరకు ఓటీటీలే దిక్కు' - బాలీవుడ్ సినిమా
ఓటీటీ వేదికగా సినిమాల్ని విడుదల చేయడంపై స్పందించాడు బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్. మహమ్మారి ఉన్నంత కాలం డిజిటల్ మాధ్యమాల్లో చిత్రాలను విడుదల చేయక తప్పదని తెలిపాడు.
!['కరోనా ఉన్నంత వరకు ఓటీటీలే దిక్కు' A Circumstances are such we have to do whatever best we can says Abhishek Bachchan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8868354-72-8868354-1600580803722.jpg)
"మీడియానే దీనిపై చర్చకు తెరలేపుతోంది. మహమ్మారి ఉన్నంత కాలం డిజిటల్ మాధ్యమాల్లో చిత్రాలను విడుదల చేయక తప్పదు. పరిస్థితుల ప్రభావం వల్ల ఏది మంచిదైతే అదే చేస్తాం. ప్రస్తుతం మాకు పని ఉన్నందుకు, మేం నటించిన సినిమాలను అభిమానులు చూస్తున్నందుకు సంతోషంగా ఉంది. నా తండ్రే నాకు మంచి స్నేహితుడు. మేం ప్రతి విషయం గురించి చర్చించుకుంటాం. ఒకరి ఆలోచనలను మరొకరితో పంచుకుంటాం. మా నాన్న గారు సూపర్ స్టార్ కావడం వల్ల నాకు సినీరంగ ప్రవేశం సులభంగా లభించిందని అందరూ అనుకుంటారు. నా మొదటి సినిమా రెఫ్యూజీలో అవకాశం చేజిక్కించుకోవడానికి పోరాటం చేయవలసి వచ్చింది. ఏదీ సులభంగా రాదు. ఏదైతే కావాలనుకుంటామో దాని కోసం పోరాటం చేయవలసి ఉంటుంది" అని అన్నాడు.