సినీ పరిశ్రమలో కొన్ని కాంబినేషన్లపై అంచనాలు పెరుగుతూ ఉంటాయి. త్రివిక్రమ్-ఎన్టీఆర్ జోడీ కూడా ఈ కోవకే చెందుతుంది. వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతుందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్.. అల్లు అర్జున్తో 'అల వైకుంఠపురములో' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
త్రివిక్రమ్- ఎన్టీఆర్ కాంబినేషన్లో భారీ బడ్జెట్ చిత్రం..! - త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్
త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా మరో సినిమా రాబోతుందని తెలుస్తోంది. ఈ చిత్రం 200 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కబోతుందని సినీ వర్గాల సమాచారం.
త్రివిక్రమ్- ఎన్టీఆర్ కాంబినేషన్లో భారీ బడ్జెట్ సినిమా?
ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా భారీ బడ్జెట్తో ఓ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఈ సినిమా బడ్జెట్ సుమారు రెండు వందల కోట్ల రూపాయల వరకు ఉండవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఎన్టీఆర్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అరవింద సమేత వీర రాఘవ' లో నటించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించింది.
ఇవీ చూడండి.. అలా అనసూయ రంగమ్మత్తగా మారింది