గత ఏడాది తమిళంలో విడుదలై భారీ విజయం సాధించిన '96' చిత్రాన్ని... తెలుగులో తెరకెక్కిస్తున్నారు దిల్‌రాజు. శ్రీ వెంకటేశ్వర బేనర్‌లో 34వ చిత్రంగా ఈ సినిమా రూపొందుతోంది. శర్వానంద్, సమంత హీరోహీరోయిన్లు. తమిళ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రేమ్‌కుమార్ తెలుగు రీమేక్‌కు దర్శకుడు. ఈ చిత్రానికి జాను లేదా జానకి దేవి అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి.
'96' కోసం కెన్యాలో శర్వానంద్, సమంత! - శర్వానంద్, సమంత
తమిళంలో ఘనవిజయం సాధించిన 96 చిత్రం తెలుగులో రీమేక్ అవుతోంది. శర్వానంద్, సమంత ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం కెన్యాలో జరుగుతున్నట్లు సమాచారం.
'96' కోసం కెన్యాలో శర్వానంద్- సమంత
ఇటీవలే మారిషస్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం... కెన్యాలో కీలక షెడ్యూల్ జరపనున్నట్లు సమాచారం. తర్వాత విశాఖపట్నం, హైదరాబాద్‌లో చిత్రీకరణ జరపనున్నారట. తమిళ '96'లో విజయ్ సేతుపతి , త్రిష జంటగా నటించారు.