సినిమా రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి హాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా ఇచ్చే అకాడమీ అవార్డు 'ఆస్కార్'. ప్రతి సంవత్సరం ఫ్రిబ్రవరిలో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా ఆస్కార్ బరిలో ఉన్న పోటీదారుల జాబితాను ఇప్పుడు విడుదల చేశారు. వచ్చే నెల 9న ఈ కార్యక్రమం అమెరికాలో జరగనుంది. ఈ వేడుకను వీక్షించటానికి ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
'ఆస్కార్-2020' బరిలో ఉన్న పోటీదారులు వీరే - జోకర్
ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు బరిలో ఉన్న చిత్రాలు, నటీనటులు, తదితర జాబితాలను 'ద అకాడమీ' తన ట్విట్టర్ వెల్లడించింది.
ఆస్కార్ అవార్డులు 2020
మరోవైపు ఈ ఏడాది అంగరంగ వైభవంగా అకాడమీ అవార్డుల వేడుకను నిర్వహించాలని అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ సన్నాహాలు చేస్తోంది. 2019లో హోస్ట్ లేకుండానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సంవత్సరమూ ఈ పద్దతినే కొనసాగించనుంది.