తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'90 ఎం.ఎల్.. ఇది చాలా తక్కువ' పాటలు విడుదల - tollywood

ఒవియా ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం '90ఎం.ఎల్'. ఈ సినిమాలోని పాటలను విడుదల చేసింది చిత్రబృందం.

సినిమా

By

Published : Apr 20, 2019, 11:40 PM IST

ఐదుగురు అమ్మాయిల చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కిన చిత్రం '90 ఎం.ఎల్.. ఇది చాలా తక్కువ'. తమిళంలో ఇదే టైటిల్​తో తెరకెక్కిన ఈ సినిమాలో ఒవియా ప్రధాన పాత్రలో నటించగా.. ప్రముఖ హీరో శింబు ప్రత్యేక ఫాత్రలో కనిపిస్తూ.. సంగీతాన్ని అందించారు. అనితా ఉదీప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కర్ణ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై యిన్నం శ్రీనివాసరావు సమర్పణలో కృష్ణ కాకర్లమూడి నిర్మాణ సారథ్యంలో నిర్మాత పఠాన్ చాంద్ బాషా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో వేడుక శనివారం హైదరాబాద్​లోని ప్రసాద్ ల్యాబ్​లో ఘనంగా జరిగింది.

ఆడియో లాంచ్

"అశ్లీల సన్నివేశాలు ఇందులో లేవు. యూత్​ను దృష్టిలో పెట్టుకుని సందేశాన్ని అందిస్తూ రూపొందించిన చిత్రమిది. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్​లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. వెన్నెలకంటి తనయుడు రాకేందు మౌళి సాహిత్యానికి శింబు అందించిన సంగీతం హైలైట్ అవుతుంది. ఈ నెల 26న సినిమాను విడుదల చేస్తున్నాం".
పఠాన్ చాంద్ బాషా, చిత్ర నిర్మాత

ABOUT THE AUTHOR

...view details