తెలంగాణ

telangana

ETV Bharat / sitara

టీజర్: ఇది లిక్కర్​తో నడిచే బండి..! - కార్తికేయ

యువహీరో కార్తికేయ కథానాయకుడిగా నటిస్తున్న '90 ఎమ్.ఎల్' టీజర్ అలరిస్తోంది. ఇటీవలే నాని 'గ్యాంగ్​లీడర్'​తో ఆకట్టుకున్నాడీ నటుడు.

టీజర్: ఇది లిక్కర్​తో నడిచే బండి..!

By

Published : Sep 21, 2019, 1:36 PM IST

Updated : Oct 1, 2019, 11:07 AM IST

టాలీవుడ్ యువహీరో కార్తికేయ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం '90 ఎమ్.ఎల్'. 'యాన్ అథరైజెడ్​ డ్రింకర్' అనేది ఉపశీర్షిక. ఈ చిత్ర టీజర్​ను శనివారం విడుదల చేసింది చిత్రబృందం. ఆద్యంతం ఆసక్తిగా ఉంటూ సినిమాపై అంచనాల్ని పెంచుతుంది.

'కాళిదాసు లాంటి కొడుకే పుట్టాలని కోరుకో.. ఏసుదాసు లాంటి ఓ సింగర్ పుట్టాలని కోరుకో.. కానీ దేవదాసు లాంటి ఓ డ్రింకర్..!', 'డీజిల్​తో నడిచే బండ్లను చూసుంటావ్, పెట్రోల్​తో నడిచే బండ్లను చూసుంటావ్.. కానీ ఇది లిక్కర్​తో నడిచే బండి, గుద్దితే అడ్రస్ ఉండదు', 'డాక్టర్ పూటకు 90యే తాగమన్నాడు' వంటి డైలాగ్​లు ఆకట్టుకుంటున్నాయి.

ఈ సినిమాలో నేహా సోలంకి హీరోయిన్. అనూప్ రుబెన్స్ సంగీతమందిస్తున్నాడు. శేఖర్​ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఆర్.ఎక్స్ నిర్మించిన అశోక్​రెడ్డి గుమ్మకొండ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు.

ఇది చదవండి: పండక్కి వచ్చేస్తున్న నందమూరి హీరో

Last Updated : Oct 1, 2019, 11:07 AM IST

ABOUT THE AUTHOR

...view details