*1983 ప్రపంచకప్ ఆధారంగా తీస్తున్న సినిమా '83'. గత కొన్ని నెలల నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం.. డిసెంబరు 24న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే టీజర్‌ను శుక్రవారం(నవంబరు 26) రిలీజ్ చేశారు. 1983 జూన్ 25న జరిగిన మ్యాచ్ దృశ్యాల్ని.. ఈ టీజర్లో కళ్లకు కట్టినట్లు చూపించారు.
ఈ సినిమాలో కపిల్‌దేవ్ పాత్రలో రణ్వీర్ సింగ్, కపిల్ భార్య పాత్రలో దీపికా పదుకొణె నటించింది. మిగతా పాత్రల్లో జీవా, పంకజ్ త్రిపాఠి, అమ్మి విర్క్, తాహిర్ బాసిన్ తదితరులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు.
*ఓటీటీలో శుక్రవారం మూడు తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో ఆకాశ్ పూరీ 'రొమాంటిక్', సాయిధరమ్ తేజ్ 'రిపబ్లిక్', నవీన్ చంద్ర 'బ్రో' చిత్రాలు ఉన్నాయి.