తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హత్య చేస్తామని ఆ దర్శకుడికి బెదిరింపులు! - ముత్తయ్య మురళీ ధరణ్​ శీను రామస్వామి బెదరింపులు

అజ్ఞాత వ్యక్తుల నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని, కాపాడాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రిని అభ్యర్థించారు ప్రముఖ దర్శకుడు శీను రామస్వామి. ఈ విషయాన్ని ట్విట్టర్​ వేదికగా పంచుకున్నారు.

Seenu Ramasamy
శీను రామస్వామి

By

Published : Oct 28, 2020, 4:54 PM IST

శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్‌ బయోపిక్ వివాదం తమిళనాడులో ఇంకా కొనసాగుతోంది. ఇటీవలే ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు నటుడు విజయ్ సేతుపతి ప్రకటించారు. ఈ క్రమంలోనే దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత శీను రామస్వామికి.. ఆగంతకుల నుంచి చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయి. దీంతో ఆయన, తమిళనాడు ముఖ్యమంత్రి పళనస్వామికి అభ్యర్థన పెట్టుకున్నారు. తన జీవితం ప్రమాదంలో ఉందని, సాయం చేయాలంటూ ట్వీట్ చేశారు.

ముత్తయ్య మురళీధరన్‌ బయోపిక్‌ నుంచి విజయ్ సేతుపతి తప్పుకోవాలని కోరిన వారిలో రామస్వామి ఒకరు. అలా అన్నందుకు కొందరు తనను బెదిరిస్తూ.. ఫోన్లు‌ చేస్తూ, సందేశాలు పంపిస్తున్నారని ఇటీవల ప్రెస్‌మీట్​లో ఆయన వెల్లడించారు. విజయ్ సేతుపతికి, తనకు మధ్య శత్రుత్వం పెంచేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇప్పటివరకు విజయ్​-శీను కాంబోలో ఐదు సినిమాలు వచ్చాయి.

ఇదీ చూడండి నాగినిగా బాలీవుడ్​ బ్యూటీ శ్రద్ధా కపూర్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details