ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో 'నో మ్యాడ్‌లాండ్', 'బోరాట్-2' చిత్రాలు సత్తాచాటాయి. ఈ ఏడాది గోల్డెన్ గ్లోబ్ ఉత్తమ చిత్రంగా 'నో మ్యాడ్‌లాండ్' నిలిచింది. కరోనా వ్యాప్తి కారణంగా కాలిఫోర్నియా వేదికగా వర్చువల్‌గా నిర్వహించిన 78వ గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుకల్లో టీవీ, సినిమా రంగాల్లో అత్యుత్తమ ప్రదర్శన ఆధారంగా అవార్డులు అందజేశారు.
ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు విజేతలు వీరే - గోల్డెన్ గ్లోబ్ విన్నర్స్
ప్రతిష్టాత్మక 78వ గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుకల్ని కాలిఫోర్నియా వేదికగా వర్చువల్‌గా నిర్వహించారు. ఈ ఏడాది గోల్డెన్ గ్లోబ్ ఉత్తమ చిత్రంగా 'నో మ్యాడ్‌లాండ్' నిలిచింది. ఉత్తమ నటుడిగా చాడ్విక్ బోస్‌మన్, ఉత్తమ నటిగా ఆండ్రా డే, ఉత్తమ దర్శకురాలిగా చోలే జావో నిలిచారు.
గోల్డెన్ గ్లోబ్
'నో మ్యాడ్‌లాండ్'కు దర్శకత్వం వహించిన చోలే జావో ఉత్తమ దర్శకురాలిగా నిలిచారు. గోల్డెన్‌గ్లోబ్ చరిత్రలో డైరెక్షన్ అవార్డును ఓ మహిళ గెలుచుకోవడం ఇది రెండో సారి. ఉత్తమ కామెడీ మ్యూజికల్ చిత్రంగా 'బోరాట్-2'.. ఉత్తమ టెలివిజన్ సిరీస్ డ్రామాగా 'క్రౌన్' ఎంపికయ్యాయి. ఉత్తమ నటుడిగా చాడ్విక్ బోస్‌మన్‌ను మరణాంతరం ఎంపిక చేశారు. ఉత్తమ నటిగా ఆండ్రా డే నిలిచారు.
ఇదీ చూడండి: దేవరకొండ బ్రదర్స్ 'పుష్పక విమానం'.. సెట్లో దిశా పటానీ