గతేడాది కరోనా కారణంగా రద్దైన ప్రపంచ ప్రఖ్యాత 'కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం' ఈసారి మళ్లీ వచ్చేసింది. ఫ్రాన్స్‌లోని కేన్స్ నగరం వేదికగా.. మంగళవారం ఈ సినిమా సంబరం ఘనంగా ప్రారంభమైంది. 74వ ఏడాది జరుగుతున్న ఈ చిత్రోత్సవంలో లియోస్ కారక్స్ దర్శకత్వం వహించిన 'అన్నెట్టే' చిత్రాన్ని తొలుత ప్రదర్శించారు.
చిత్రోత్సవంలో భాగంగా.. మొదటి రోజు ఎర్ర తివాచీపై పలువురు హాలీవుడ్ తారలు నడుస్తూ ఫొటోలకు పోజులిచ్చారు. వచ్చే శనివారం(జులై 17) వరకు ఈ సినీ సంబరం కొనసాగనుంది.