"కన్నుల బాసలు తెలియవులే.. కన్యల మనసులు ఎరుగవులే" అంటూ '7/జీ బృందావన కాలనీ' చిత్రంలో నటించిన రవికృష్ణ, సోనియా అగర్వాల్ గుర్తున్నారా? 2004లో వచ్చిన ఆ సినిమా వీరిద్దరికి మంచి గుర్తింపు తెచ్చింది. తాజాగా ఈ జోడీ కలిసి ఓ ఫొటో దిగారు.
మరోసారి మెరిసిన '7/జీ' చిత్ర ప్రేమికులు! - ravi
'7/జీ బృందావన కాలనీ' చిత్రంతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న హీరోహీరోయిన్లు రవికృష్ణ, సోనియా అగర్వాల్. తాజాగా వీరిద్దరు కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్లో పంచుకుంది సోనియా.

రవికృష్ణ - సోనియా
"నిన్న రాత్రి నేను ఎవరిని కలిశానో చూడండి" అంటూ హీరో రవికృష్ణతో దిగిన ఫొటోను ట్విట్టర్లో షేర్ చేసింది సోనియా.
ఈ చిత్రానికి దర్శకత్వం సెల్వరాఘవన్ వహించాడు. తమిళంలో '7/జీ రెయిన్బో కాలనీ', తెలుగులో '7/జీ బృందావన కాలనీ' పేరుతో ఒకే సారి రెండు చోట్ల విడుదలై బంపర్ హిట్ కొట్టింది ఈ చిత్రం.