తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అట్టహాసంగా మొదలై.. అర్ధాంతరంగా ఆగిపోయిన సినిమాలు! - షూటింగ్​ ఆగిపోయిన టైమ్ మెషీన్

నటీనటులు దర్శకుల మధ్య సరైన కమ్యునికేషన్​ లేకపోవడం వల్ల కావొచ్చు.. బడ్జెట్​ సరిపోకపోవడం వల్ల కొన్ని సినిమాలు మధ్యలోనే ఆపేసిన సందర్భాలూ ఉన్నాయి. అలాంటి కొన్ని బాలీవుడ్​ చిత్రాల గురించే ఈ కథనం.

7 big-budget Bollywood films that were shelved due to wrong casting and ego clashes
అర్ధాంతరంగా ఆగిపోయినా భారీ బడ్జెట్​ చిత్రాలు!

By

Published : Dec 11, 2020, 9:00 AM IST

Updated : Dec 11, 2020, 12:24 PM IST

సినిమా ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు ఎన్నో అంశాల దానికి ముడిపడి ఉంటాయి. ఏదైనా అవాంతరం తలెత్తినా, బడ్జెట్​ సరిపోకపోయినా అక్కడిక్కడే ఆగిపోయిన చిత్రాలెన్నో ఉన్నాయి. ప్రపంచంలోని ఏ సినీ పరిశ్రమకైనా ఇలాంటి కష్టాలు తప్పవు! మరి అలానే భారీ బడ్జెట్​తో, లాంఛనంగా మొదలైన కొన్ని బాలీవుడ్​ సినిమాలు.. అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఆ తర్వాత అవి కార్యరూపం దాల్చలేదు. ఆ జాబితాలో అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, సంజయ్ దత్​ లాంటి స్టార్​ల ప్రాజెక్టులు కూడా ఉన్నాయంటే నమ్మగలరా?

అర్ధాంతరంగా ఆగిపోయిన బాలీవుడ్ భారీ బడ్జెట్​ సినిమాలు

1) అప్నా పరాయ

1972లో అమితాబ్​, రేఖ ప్రధాన పాత్రల్లో 'అప్నా పరాయ' సినిమాను ప్రారంభించారు. తొలి​ షెడ్యూల్​ పూర్తయిన తర్వాత ఫ్లాప్​ స్టేటస్​ కారణంగా బిగ్​బీని ప్రాజెక్టు నుంచి దర్శకుడు తప్పించారు.

ఆ తర్వాత కొన్నాళ్లకు 'దునియా కే మిలా'గా టైటిల్ మార్చి సంజయ్​ ఖాన్​, రేఖలతో ఆ సినిమా తీశారు. 1974లో విడుదలవగా ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది ఆ సినిమా. సరిగ్గా అప్పుడే వచ్చిన అమితాబ్​ 'జంజీర్​' సూపర్​హిట్​గా నిలిచింది. ఈ సినిమా నుంచి బిగ్​బీని తప్పించడం వల్ల ఆయనకు మంచే జరిగిందని బాలీవుడ్​ పెద్దలు అభిప్రాయపడ్డారు.

2) టైమ్​ మెషీన్​

బాలీవుడ్​ దర్శకుడు శేఖర్​ కపూర్​ తీసిన 'టైమ్​ మెషీన్​'(1992) సినిమా సగంలోనే ఆగిపోయింది. హాలీవుడ్​ చిత్రం 'బ్యాక్​ టు ది ఫ్యూచర్​' స్ఫూర్తిగా దీనిని ప్రారంభించారు. ఇందులో ఆమిర్​ ఖాన్​, రవీనా టాండన్​, రేఖా, నసీరుద్దీన్​ షా, గుల్షన్​ గ్రోవర్​, విజయ్​ ఆనంద్​ కీలకపాత్రల్లో నటించారు. నాలుగింట మూడొంతులు పూర్తయిన తర్వాత బడ్జెట్​ సమస్య వల్ల షూటింగ్ ఆపేశారు. ఆ వెంటనే శేఖర్​ కపూర్​ అమెరికా వెళ్లిపోయారు.

3) పరిణామ్​

అక్షయ్​ కుమార్​, దివ్య భారతి హీరోహీరోయిన్లుగా 'పరిణామ్​' చిత్రం 1993లో మొదలైంది. అదే ఏడాది ఏప్రిల్​లో దివ్యభారతి మృతి చెందడం వల్ల సినిమా అలానే ఆగిపోయింది.

దివ్య భారతి, అక్షయ్​ కుమార్

4) దస్​

సంజయ్​ దత్​, సల్మాన్​ ఖాన్​ ప్రధానపాత్రల్లో 'దస్​' అనే పెద్ద యాక్షన్​ మూవీ తెరకెక్కాల్సింది. 1997లో షూటింగ్ కూడా​ ప్రారంభించారు. భారత్​-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని నివారించే రహస్య ఏజెంట్ల పాత్రల్లో ఈ ఇద్దరు హీరోలు నటించారు. అయితే చిత్రీకరణ దశలో ఉండగానే దర్శకుడు ఆనంద్​ కన్నుమూశారు. అసంపూర్తిగా ఉన్న చిత్రం విడుదలకు నోచుకోలేదు. అయితే ఇదే టైటిల్​తో 2005లో సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, సునీల్ శెట్టి, శిల్పా శెట్టి ప్రధాన తారాగణంగా మరో సినిమా తెరకెక్కి విజయవంతమైంది.

సంజయ్​ దత్​, సల్మాన్​ ఖాన్

5) టైమ్ టూ డాన్స్​

స్టార్​ హీరోయిన్​ కత్రినా కైఫ్​ సోదరి ఇసా బెల్లా 'టైమ్​ టూ డాన్స్'​ చిత్రంతో 2018లో బాలీవుడ్​ అరంగేట్రం చేయాల్సింది. డాన్స్​ పోటీలు కథాంశంతో దీనిని తెరకెక్కించారు. ఇందులో ఇస్​ బెల్లాతో పాటు సూరజ్​ పంచోలీ హీరోగా నటించారు. స్టాన్లీ డీ కోస్టా దర్శకత్వం వహించారు.

చిత్రీకరణ పూర్తి చేసుకున్న తర్వాత కొన్ని సన్నివేశాలను రీషూట్​ చేయాలని చిత్ర నిర్మాతలు అభిప్రాయపడ్డారు. దీనికి ఎవరూ ముందుకు రాకపోవడం వల్ల అది అక్కడే ఆగిపోయింది. ఇస్​ బెల్లా ప్రస్తుతం సల్మాన్​ ఖాన్​ బావమరిది ఆయుష్​ శర్మ నటిస్తున్న 'క్వాథా' సినిమాలో నటిస్తుంది.

6) షూబైట్​

కొన్ని మీడియా నివేదికల ప్రకారం.. దశాబ్దం క్రితం, సూజీత్​ సర్కార్​ దర్శకత్వంలో అమితాబ్​ బచ్చన్​ హీరోగా 'జానీ వాకర్​' చిత్రాన్ని ప్రారంభించారు. అయితే ఆ సినిమా షూటింగ్ మొదలవలేదు. దర్శకుడు ఇదే కథను తీసుకుని యూటీవీ మోషన్​ పిక్చర్స్​ను సంప్రదించారు. ఆ తర్వాత దీనికి 'షూబైట్​' అని టైటిల్​ మార్పు చేశారు. ఈ సినిమా కథపై మీడియా, చిత్ర సంస్థల మధ్య భారీ న్యాయపోరాటం జరిగింది. ఈ ప్రక్రియలోనే షూబైట్​ చిత్రీకరణను పూర్తి చేసినా.. ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. 2018లో ఈ సినిమా విడుదల కాబోతుందని అమితాబ్​ ట్వీట్​ చేసినా.. దీనిపై ఇప్పటికీ ఎలాంటి సమాచారం లేదు.

'షూబైట్​'లో అమితాబ్​ బచ్చన్​
'షూబైట్​' చిత్ర పోస్టర్​
Last Updated : Dec 11, 2020, 12:24 PM IST

ABOUT THE AUTHOR

...view details