తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అక్షయ్ స్పీడ్​ మామూలుగా లేదు.. ఏడాదికి ఏడు సినిమాలు! - dhanush, sara ali khan ,dhanush

బాలీవుడ్ సూపర్​స్టార్ అక్షయ్ కుమార్ ఫుల్ జోష్​లో ఉన్నారు. అతడి ఏడు సినిమాలు ఈ ఏడాదే విడుదల కానున్నాయి. అవన్నీ వేటికవే భిన్నమైన నేపథ్య కథలతో తెకెక్కుతున్నాయి.

7 Akshay Kumar movies to look forward to in 2021
అక్షయ్ అస్సలు తగ్గట్లేదు.. ఒకే ఏడాది ఏడు సినిమాలతో!

By

Published : Jan 4, 2021, 9:06 AM IST

అప్పట్లో హీరోలు.. ఏడాదికి ఐదు, పది అంతకంటే ఎక్కువ సినిమాలు చేసిన సందర్భాలు అనేకం. కానీ ప్రస్తుత తరంలో కథానాయకులు.. సంవత్సరానికి ఒకటి, రెండు చిత్రాలు చేయడం గగనమైపోయింది. అలాంటిది వరుసగా సినిమాలు చేస్తూ, ఎవ్వరికీ అందనంత ఎత్తులో బాలీవుడ్​ స్టార్ అక్షయ్ కుమార్ నిలిచారు. ఈయనకు చేస్తున్న దాదాపు ఏడు సినిమాలు.. థియేటర్లలో ఈ ఏడాదిలోనే విడుదల కానున్నాయి! ఇంతకీ అవేంటి? వాటి సంగతులేంటి?

బెల్ బాటమ్

స్పై థ్రిల్లర్ కథతో తీస్తున్న ఈ సినిమా షూటింగ్​.. లాక్​డౌన్ సడలింపులు ఇచ్చిన తర్వాత జరిగింది. స్కాట్లాండ్​లో ఒకే షెడ్యూల్​లో మొత్తం పూర్తి చేశారు. ఇందులో అక్షయ్ రా ఏజెంట్​గా కనిపించనున్నారు. వాణీ కపూర్ హీరోయిన్. ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

బెల్​ బాటమ్ సినిమాలో అక్షయ్ కుమార్

సూర్యవంశీ

ఈ పోలీస్​ యాక్షన్ డ్రామా.. గతేడాది మార్చిలోనే రావాల్సింది. లాక్​డౌన్​తో థియేటర్లు మూతపడటం వల్ల వాయిదా పడింది. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కత్రినా కైఫ్, అజయ్ దేవ్​గణ్, రణ్​వీర్ సింగ్ కీలక పాత్రలు పోషించారు. రాబోయే మార్చిలో సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

సూర్యవంశీ సినిమాలో అక్షయ్ కుమార్

అత్రాంగి రే

ఈ సినిమాలో అక్షయ్​తో పాటు సారా అలీఖాన్, ధనుష్ నటిస్తున్నారు. లాక్​డౌన్​ కంటే ముందు ప్రకటించినప్పటికీ.. ఈ మధ్యే షూటింగ్ మొదలుపెట్టగా, ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకుడు. ఈ ఏడాది జూన్, జులైలో థియేటర్లలో చిత్రం విడుదలయ్యే అవకాశముంది.

అత్రాంగి రే సినిమాలో అక్షయ్, సారా అలీఖాన్, ధనుష్

పృథ్వీరాజ్

చారిత్రక కథతో తీస్తున్న ఈ సినిమాను, యోధుడు పృథ్వీరాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. అక్షయ్ టైటిల్​ రోల్ చేస్తున్నారు. మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ కథానాయిక. గతేడాది రిలీజ్​ కావాల్సిన ఈ చిత్రం.. లాక్​డౌన్​ దెబ్బకు ఆగిపోయింది. ఈ ఏడాది ఎలాగైనా సరే విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకుడు. యష్ రాజ్​ ఫిల్మ్స్​ నిర్మిస్తోంది.

పృథ్వీరాజ్ సినిమాలో అక్షయ్ కుమార్

రక్షా బంధన్

అన్నా చెల్లెల్ల బంధానికి ప్రతీకగా నిలిచే కథతో ఈ సినిమా తీస్తున్నారు. ఈ ఏడాది నవంబరు 5న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. తన కెరీర్​లో అత్యంత వేగంగా ఒప్పుకొన్న చిత్రమిదని అక్షయ్ చెప్పారు. ఆనంద్ ఎల్ రాయ్ దీనికి దర్శకుడు.

రక్షా బంధన్ సినిమాలో అక్షయ్ కుమార్

రామ్ సేతు

అక్షయ్ చేస్తున్న ఆసక్తికర సినిమా 'రామ్​ సేతు'. నిజమా కల్పన? అనే ట్యాగ్​లైన్​తో చిత్ర పోస్టర్​ను కొన్ని నెలల క్రితం విడుదల చేయగా, విపరీతమైన స్పందన వచ్చింది. 'రామ్​సేతు'ను థియేటర్లలోకి ఈ ఏడాదే తీసుకొచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అభిషేక్ శర్మ దర్శకుడు.

రామ్​సేతు సినిమాలో అక్షయ్ కుమార్

బచ్చన్ పాండే

అజిత్ తమిళ సినిమా 'వీరమ్​'కు ఇది రీమేక్. ఎప్పుడో దీనిపై ప్రకటన వచ్చినప్పటికీ లాక్​డౌన్​ వల్ల షూటింగ్​ ప్రారంభించలేకపోయారు. కానీ ఈ సంవత్సరంలోనే చిత్రాన్ని విడుదల చేయాలని దర్శకులు భావిస్తున్నారు. కృతి సనన్ హీరోయిన్. ఫర్హాద్ సమ్జీ దర్శకుడు.

అక్షయ్ కుమార్ బచ్చన్ పాండే

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details