- జాతీయ ఉత్తమ చిత్రం - హెల్లారో (గుజరాతీ)
- జాతీయ ఉత్తమ తెలుగు చలన చిత్రంగా మహానటి
- జాతీయ ఉత్తమ నటుడు- విక్కీ కౌశల్(ఉరి), ఆయుష్మాన్ ఖురాన్(అంధాదున్)
- జాతీయ ఉత్తమ నటి - కీర్తి సురేశ్ (మహానటి)
- ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ పురస్కారం - మహానటి
- జాతీయ ఉత్తమ ఆడియోగ్రఫీ - రంగస్థలం (రాజాకృష్ణన్)
- జాతీయ ఉత్తమ స్క్రీన్ ప్లే - చి.ల.సౌ
- జాతీయ ఉత్తమ యాక్షన్ చలన చిత్రం - కేజీఎఫ్
- జాతీయ ఉత్తమ హిందీ చలన చిత్రం- అంధాధున్
- జాతీయ ఉత్తమ సినిమాటోగ్రఫీ- పద్మావత్
- ఉత్తమ సంగీత దర్శకుడు - సంజయ్ లీలా భన్సాలీ (పద్మావత్)
- జాతీయ ఉత్తమ ఉర్దూ చిత్రం - హమీద్
లైవ్: 'మహానటి'కి ముచ్చటగా మూడు అవార్డులు - కేంద్ర ప్రభుత్వం
16:03 August 09
ఉత్తమ నటిగా కీర్తి సురేశ్(మహానటి)
15:58 August 09
'ఉరి' చిత్రానికి అవార్డులు
ఆర్మీ సర్జికల్ స్ట్రైక్ కథాంశంతో తెరకెక్కిన 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్' సినిమాకు రెండు జాతీయ సినిమా అవార్డులు వరించాయి. ఉత్తమ దర్శకుడిగా ఆదిత్య ధర్, ఉత్తమ నటుడిగా విక్కీ కౌశల్ పురస్కారం సొంతం చేసుకున్నారు.
15:55 August 09
'మహానటి'కి జాతీయ పురస్కారాల పంట
మూడు విభాగాల్లో అవార్డులు గెలుచుకున్న 'మహానటి'.
ఉత్తమ తెలుగు చిత్రం, ఉత్తమ జాతీయ నటి, ఉత్తమ కాస్టూమ్స్ విభాగాల్లో పురస్కారాలు దక్కించుకుంది.
15:50 August 09
ఉత్తమ కొరియోగ్రాఫీ 'పద్మావత్' చిత్రానికే
పద్మావత్ చిత్రంలోని 'గూమర్' పాటకు ఉత్తమ కొరియోగ్రాఫీ అవార్డు దక్కింది.
15:46 August 09
'మహానటి'కి మరో పురస్కారం
- జాతీయ ఉత్తమ మేకప్ - రంజిత్
- ఉత్తమ కాస్ట్యూమ్ రూపకర్తలు: ఇంద్రాక్షి పాఠక్, గౌరంగ్ షా, అర్చనారావు (మహానటి చిత్రానికి)
15:41 August 09
ఉత్తమ గాయకుడు 'అర్జిత్ సింగ్'
'పద్మావత్' చిత్రానికిగానూ సింగర్ అర్జిత్ సింగ్.. జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ గాయకుడిగా ఎంపికయ్యాడు.
15:36 August 09
'రంగస్థలం' సినిమాకు జాతీయ అవార్డు
- ఉత్తమ ఆడియోగ్రఫీ - రంగస్థలం (రాజాకృష్ణన్)
- ఉత్తమ స్క్రీన్ ప్లే - చి.ల.సౌ
15:32 August 09
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ చిత్రంగా 'అ!'
స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఉత్తమ చిత్రం అవార్డును తెలుగు చిత్రం 'అ!', కన్నడ సినిమా 'కేజీఎఫ్' సంయుక్తంగా పంచుకున్నాయి.
15:30 August 09
ఉత్తమ యాక్షన్ చిత్రం 'కేజీఎఫ్'
- జాతీయ ఉత్తమ సినిమాటోగ్రఫీ చిత్రంగా 'పద్మావత్'
- ఉత్తమ సంగీత దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ (పద్మావత్)
- ఉత్తమ ఉర్దూ చిత్రం 'హమీద్'
- ఉత్తమ యాక్షన్ చలనచిత్రం 'కేజీఎఫ్'
15:28 August 09
సినిమాలకు ఉత్తమ స్నేహపూర్వక రాష్ట్రంగా ఉత్తరాఖండ్
15:27 August 09
దిల్లీలో జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రకటన
- జాతీయ ఉత్తమ హిందీ చలనచిత్రంగా అంధాదున్
- జాతీయ ఉత్తమ తెలుగు చలనచిత్రంగా మహానటి
14:57 August 09
జాతీయ చలనచిత్ర అవార్డులను కాసేపట్లో ప్రకటించనున్నారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖకు ఇప్పటికే అందజేశారు జ్యూరీ సభ్యులు.
" జ్యూరీ సభ్యులు రెండు నెలలు కష్టపడి అవార్డుల జాబితా తయారు చేశారు. మంచి చిత్రాలు, దర్శకులకు తగిన స్థానం వాళ్లు కల్పించే ఉంటారని నమ్మతున్నా. వారే 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను అధికారంగా ప్రకటిస్తారు". -ప్రకాశ్ జావడేకర్, కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ మంత్రి
పురస్కారాల ప్రదానోత్సవ వేడుకకు సంబంధించిన తేదీ, వేదిక ఇంకా నిర్ణయించేలేదని చెప్పారు జావడేకర్.
ఏటా ఈ అవార్డులను ఏప్రిల్లో ప్రకటించేవారు. తర్వాత పురస్కారాల ప్రదానోత్సవం మే 3వ తేదీన నిర్వహించేవారు. ఈ పద్ధతి 1913 నుంచి అవలంబిస్తోంది ప్రభుత్వం. అయితే ఈ ఏడాది లోక్సభ ఎన్నికల కారణంగా ఆగస్టు వరకు.. ఈ అవార్డుల ప్రకటన వాయిదా వేసింది.