మచ్చలు లేకుండా, ఎల్లప్పుడూ మెరిసే చర్మంకోసం 'మహానటి' చిత్రం కథానాయిక కీర్తి సురేశ్.. అదిరిపోయే బ్యూటీ టిప్స్‌ను అందించారు. అవి మీరూ పాటించాలని ఉందా..? అయితే ఈ కథనం చదివేయండి మరి.
కీర్తి సురేశ్ బ్యూటీ టిప్స్.. మీరూ ఫాలో అవ్వండి!
అందమైన ముఖాన్ని ఎవరు కోరుకోరు? మరి నిగనిగలాడే చర్మ సౌందర్యం కోసం 'మహానటి' కీర్తి సురేశ్ కొన్ని బ్యూటీ టిప్స్‌ను మనకందించారు. వాటిపై మీరూ ఓ లుక్కేయండి.
కీర్తి సురేశ్
కీర్తి సురేశ్ 6 బ్యూటీ టిప్స్ ఇవే..
- చర్మాన్ని శుభ్రం చేసుకోవటం, టోనింగ్, మాశ్చురైజింగ్ చేయాలి.
- వీలైనన్ని ఎక్కువ నీళ్లు తాగండి. ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోండి. రోజుకు కనీసం రెండు లీటర్ల నీరు కచ్చితంగా తాగాల్సిందే.
- షూటింగ్ లేని సమయంలో సింపుల్‌గా, సులభంగా ఉండే మేకప్ వేసుకుంటా.
- మామూలు రోజుల్లో కాజల్ ఐలైనర్‌ను మాత్రమే వాడతా. కళ్లకు కాజల్ ఐలైనర్‌ను వాడేందుకు మాత్రమే ఇష్టపడతా.
- నిద్రపోయేముందు మాత్రం మేకప్ తీసేయాల్సిందే. నిద్ర పోయేముందు కనీసం రెండుసార్లు ఫేస్‌వాష్ చేసుకోవాలి. దీనివల్ల చర్మంపై ఉన్న ఆయిల్, దుమ్ము చెరిగిపోతాయి.
- మరీ ఎక్కువ ఉత్పత్తులను చర్మంపై వాడొద్దు. అలా వాడటం వల్ల చర్మం దెబ్బతింటుంది.
ఇదీ చదవండి:చర్మంపై మృత కణాలు బాధిస్తున్నాయా..? అయితే మీకోసమే!