బాలీవుడ్ స్టార్స్ విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. ఈ విషయమై అధికారికంగా ఎలాంటి ప్రకటన రానప్పటికీ, సోషల్ మీడియాలో దీని గురించి చర్చ జరుగుతోంది. అయితే ఈ పెళ్లికి వచ్చే అతిథుల కోసం భారీ స్థాయిలో 45 హోటల్స్ బుక్ చేశారట.
రాజస్థాన్లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ హోటల్లో డిసెంబరు 7-9 తేదీల మధ్య విక్కీ-కత్రినా పెళ్లి వేడుక జరగనుంది. ఇందులో భాగంగానే వేడుకకు విచ్చేసే ప్రముఖుల కోసం రణతంబోర్లోని దాదాపు 45 లగ్జరీ హోటల్స్ బుక్ చేసినట్లు తెలుస్తోంది. ఒక్కోహోటల్లో దాదాపు 20 మంది వరకు ఉండొచ్చట.