తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చిరంజీవికి ఎప్పటికీ గుర్తుండిపోయే ఆ క్షణం - #chiranjeevi

'పునాదిరాళ్లు' సినిమా తొలి షాట్ చిరుపై​ తీసి దాదాపు 43 ఏళ్లు గడిచింది. ఆ సన్నివేశంతోనే ఆయన తొలిసారి వెండితెర అరంగేట్రం చేశారు.

43 Years ago, On 11th Feb 1978 - First scene of PunadhiRallu movie was shot with Megastar chiranjeevi
43 ఏళ్ల క్రితం 'చిరంజీవి' అయిన ఆ క్షణం

By

Published : Feb 11, 2021, 1:50 PM IST

శివ శంకర్ వరప్రసాద్.. అరే ఈ పేరు ఎక్కడో విన్నట్లుంది. కానీ గుర్తు రావట్లేదు అని మీరు అనుకుంటున్నారా? ఇది మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు. అదేంటి ఈ విషయాన్ని మళ్లీ ఇప్పుడు ఎందుకు చెబుతున్నారా అని భావిస్తున్నారా? మరేం లేదు.. ఆయనపై తొలి షాట్​ తీసి ఈ గురువారానికి(ఫిబ్రవరి 11) సరిగ్గా 43 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా అప్పటి సంగతుల్ని మరోసారి గుర్తుచేసుకుందాం.

మెగాస్టార్ చిరంజీవి

మద్రాసు ఫిల్మ్​ ఇన్​స్టిట్యూట్​లో యాక్టింగ్​ కోర్సు పూర్తి చేసిన తర్వాత చిరంజీవికి తొలి అవకాశం 'పునాదిరాళ్లు' సినిమాతో వచ్చింది. నలుగురు హీరోల్లో ఒకడిగా ఆయన ఎంపికయ్యారు. ఈయనపై తొలి సీన్ తూర్పు గోదావరి జిల్లాలోని దోసకాయలపల్లిలో 1978 ఫిబ్రవరి 11న తీశారు. ఆ జ్ఞాపకానికి నేటితో 43 ఏళ్లు పూర్తయ్యాయి.

పునాదిరాళ్లు సినిమా ఫొటోలు

'పునాదిరాళ్లు'లో చిరు.. ఓ కథానాయకుడిగా చేసిన సరే తన నటన, డ్యాన్స్​లతో దర్శక నిర్మాతల దృష్టిలో పడ్డారు. అనంతర కాలంలో పలు సినిమాల్లో​ హీరోగా నటించి విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నారు. ఖైదీ, గ్యాంగ్​లీడర్, స్వయంకృషి, జగదేకవీరుడు అతిలోకసుందరి, ముఠామేస్త్రీ, ఛాలెంజ్, చంటబ్బాయ్, కొండవీటి దొంగ, రుద్రవీణ లాంటి చిత్రాలతో మెగాస్టార్ అభిమానుల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేశారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' చేస్తున్నారు.

ఇది చదవండి:ఆ చిత్రం కోసం ఒకే డ్రెస్‌ రెండేళ్లు వేసుకున్న చిరు!

ABOUT THE AUTHOR

...view details