ఆమిర్‌ఖాన్ నటించిన 'త్రీ ఇడియట్స్' సినిమా గుర్తుందా! ఆ చిత్రంలో సీనియర్ విద్యార్థులు జూనియర్లను హస్టల్లో ర్యాగింగ్ చేసే సన్నివేశం కడుపుబ్బా నవ్విస్తుంది. కానీ ఆ సీన్ చిత్రీకరించేటప్పుడు మాత్రం నటులు ఇబ్బంది పడ్డారంట. బెంగళూరు ఐఐఎమ్ క్యాంపస్‌లో ఆ సన్నివేశం షూటింగ్ జరిగింది. చిత్రీకరణ జరుగుతోందని తెలిసి ఆసక్తితో హాస్టల్లో ఉన్న అమ్మాయిలు కూడా గుమికూడారట. సన్నివేశం కోసం ఒంటి మీద అండర్‌వేర్‌తో నిలబడాలి.. చుట్టూ చూస్తే అమ్మాయిలు. సన్నివేశం కోసం తప్పదు. ఈ పరిస్థితుల్లో టేక్ ఓకే చెప్పగానే ప్యాంట్ వేసుకునేవాళ్లంట. అలా సీన్ పూర్తయ్యే వరకు సిగ్గుతో తెగ ఇబ్బంది పడ్డారంట నటులు. ఈ విషయాన్ని ఆ సినిమాలో ఓ హీరోగా నటించిన మాధవన్ తెలిపారు.
'అమ్మాయిల ముందు అలా నిలబడాలంటే సిగ్గేసింది' - madhavan
'త్రీ ఇడియట్స్' సినిమా చిత్రీకరణ సమయంలో ఓ సన్నివేశం చేయడానికి తెగ ఇబ్బంది పడ్డారట నటులు. అమ్మాయిల ముందు అండర్‌వేర్‌తో నటించాల్సి వచ్చిన సందర్భాన్ని హీరో మాధవన్ పంచుకున్నారు.
3 ఇడియట్స్
2009 డిసెంబర్ 25న విడుదలైన ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్, మాధవన్, షర్మాన్ జోషి నటించారు. ఈ సినిమాను రాజ్‌కుమార్ హిరానీ తెరకెక్కించగా వినోద్ చోప్రా నిర్మించారు. ప్రపంచ వ్యాప్తంగా 460 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం ఆమిర్ కెరీర్లో మరపురాని సినిమాగా మిగిలింది.
Last Updated : Sep 29, 2019, 9:41 PM IST