యాంకర్ ప్రదీప్ తొలిసారి హీరోగా నటించిన చిత్రం '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?'. మున్నా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. జనవరి 29న థియేటర్లలో విడుదలై అందరి ప్రశంసలు అందుకుంటోంది. అమృతా అయ్యర్ కథానాయికగా, శివన్నారాయణ, హేమ, పోసాని కృష్ణమురళి, శుభలేఖ సుధాకర్, వైవా హర్ష, హైపర్ ఆది, ఆటో రామ్‌ప్రసాద్, భద్రం, జబర్దస్త్ మహేశ్ కీలక పాత్రల్లో నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఎస్వీ బాబు నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా ఈ చిత్రబృందం విజయోత్సవ సభను ఏర్పాటు చేసింది.
ఈ సినిమా వారికి అంకితం: మున్నా - ప్రదీప్ మాచిరాజు
యాంకర్ ప్రదీప్, అమృతా అయ్యర్ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?'. జనవరి 29న విడుదలైన ఈ చిత్రం అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది చిత్రబృందం.
30 రోజుల్లో ప్రేమించడం ఎలా?. సక్సెస్ మీట్
ఈ సందర్భంగా ఈ చిత్రానికి ఇంతటి విజయం అందించిన ప్రేక్షకులకు చిత్రబృందం కృతజ్ఞతలు చెప్పింది. మొదటి సినిమానే ఇంతపెద్ద హిట్ చేసినందుకు ఎంతో రుణపడి ఉంటామని డైరెక్టర్ మున్నా అన్నారు. ఈ సినిమా కొత్తగా సినిమా తీసే డైరెక్టర్లకు, నటులకు అంకితం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.