తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఒకే నెల- 3 ఏళ్లు- 3 చిత్రాలు.. 3 రికార్డులు - ఎండ్ గేమ్

బాహుబలి-2, అవెంజర్స్​ ఇన్ఫినిటీ వార్, అవెంజర్స్​ ఎండ్​గేమ్ వరుసగా మూడేళ్లు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి. ఈ మూడు చిత్రాలు ఒకె నెలలో ఒక్కో రోజు తేడాతో విడుదలయ్యాయి.

RECORDS

By

Published : Apr 27, 2019, 4:04 PM IST

ఏప్రిల్... వేసవి సెలవుల ఈ నెల నుంచే ప్రారంభమౌతాయి. పిల్లలతో ఇల్లు కళకళలాడుతోంది. ఇంతకంటే మంచి సీజన్​ ఏముంటుంది సినిమాలకు? గత మూడేళ్ల నుంచి మూడు చిత్రాలు ఏప్రిల్ చివరి వారంలో విడుదలై వసూళ్ల వర్షం కురిపించాయి. బాహుబలి 2, అవెంజర్స్​ ఇన్ఫినిటీ వార్, ఎండ్ గేమ్ చిత్రాలు ఒకే నెలలో ఒక్కో రోజు తేడాతో విడుదలయ్యాయి.

2017 ఏప్రిల్ 28న విడుదలైంది బాహుబలి 2 చిత్రం. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 2 వేల కోట్ల కలెక్షన్లు సాధించింది. అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ సినిమాగా రికార్డుకెక్కింది.

2018 ఏప్రిల్ 27న విడుదలైంది అవెంజర్స్​ ఇన్ఫినిటీ వార్ చిత్రం. గత ఏడాది అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డుకెక్కింది. 400 మిలియన్ డాలర్లతో(2 వేల 700 కోట్లు) తెరకెక్కిన ఈ చిత్రం 2 బిలియన్ డాలర్లు(రూ. 13వేల కోట్లు) పైగా వసూల్​ చేసింది.

2019 ఏప్రిల్​ 26న ప్రేక్షకుల ముందుకొచ్చింది అవెంజర్స్​ ఎండ్​ గేమ్​. తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్​తో దూసుకుపోతోంది. ఈ చిత్రం ఇన్ఫినిటీవార్ కంటే ఎక్కువ వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా.

యాధృచ్ఛికంగా మూడేళ్ల నుంచి ఒకే నెలలో ఒక్కో రోజు తేడాతో విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్​ల సునామీలు సృష్టించాయి ఈ మూడు చిత్రాలు.

ABOUT THE AUTHOR

...view details