తెలంగాణ

telangana

ETV Bharat / sitara

డీడీఎల్​జే@25: లండన్​లో షారుఖ్​, కాజోల్​ జోడీ కాంస్య విగ్రహం - 25 ఏళ్లు పూర్తి చేసుకున్న దిల్​వాలే దుల్హనియా లేజాయేంగే

90వ దశకంలో సంచలన విజయం సాధించిన చిత్రం 'దిల్​వాలే దుల్హానియా లే జాయేంగే' విడుదలై మంగళవారానికి 25 వసంతాలు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా లండన్​లోని 'సీన్స్​ ఇన్​ ది స్క్వేర్​'లో షారుఖ్​, కాజోల్​ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

25 years of 'Dilwale Dulhania Le Jayenge': Shah Rukh Khan-Kajol's statue to be part of London's 'Scenes in the Square'
లండన్​లో షారుఖ్​, కాజోల్​ కాంస్య విగ్రహం

By

Published : Oct 19, 2020, 11:55 AM IST

Updated : Oct 19, 2020, 12:24 PM IST

బాలీవుడ్​ స్టార్​ హీరో షారుఖ్​ ఖాన్​, కాజోల్​ జంటగా నటించిన చిత్రం 'దిల్​వాలే దుల్హానియా లే జాయాంగే'. ఈ చిత్రం విడుదలై మంగళవారంతో 25 వసంతాలు పూర్తివనున్నాయి. ఈ సందర్భంగా షారుఖ్​, కాజోల్​ కాంస్య విగ్రహాన్ని లండన్​లో ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహాన్ని లీసెస్టర్​ స్క్వేర్​లో ప్రదర్శించనున్నారు.

"హిందీలో విడుదలై అత్యంత విజయవంతమైన చిత్రాల్లో 'దిల్​వాలే దుల్హానియా లే జాయేంగే' ఆల్​టైమ్​ ఫేవరేట్​గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన ఈ బాలీవుడ్​ చిత్రానికి ప్రతీకగా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నాం."

- మార్క్​ విలియమ్స్​, హార్ట్​ ఆఫ్​ లండన్​ బిజినెస్​ మార్కెటింగ్​ డైరెక్టర్​

'దిల్​వాలే దుల్హానియా లే జాయేంగే' చిత్రానికి ఆదిత్యా చోప్రా దర్శకత్వం వహించారు. 1995 అక్టోబరు 20న విడుదలైంది. ఈ చిత్రంలో షారుఖ్​ ఖాన్​, కాజోల్​తో పాటు అమ్రిష్​ పురి, అనుపమ్​ ఖేర్​, ఫరీదా జలాల్​, హిమాని శివ్​పురి, సతీశ్​ షా, మహింద్రా బేడి, పర్​మీత్​ సేథి, అచ్చల సచ్​దేవ్​, కరన్​ జోహర్​, అనైతా ష్రాఫ్​, అర్జున్​ షాబ్​లోక్​లు కీలకపాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి 43వ జాతీయ సినీ పురస్కారాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాగా అవార్డు లభించింది.

Last Updated : Oct 19, 2020, 12:24 PM IST

ABOUT THE AUTHOR

...view details