తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రభాస్ 'జాన్' కోసం ఖరీదైన 25 సెట్ డిజైన్స్! - saaho latest news

ప్రభాస్-పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న కొత్త సినిమా కోసం ఖరీదైన 25 సెట్​ డిజైన్లు రూపొందించినట్లు సమాచారం. దాదాపు రూ.180 కోట్ల బడ్జెట్​తో తెరకెక్కుతోందీ చిత్రం.

ప్రభాస్

By

Published : Nov 15, 2019, 10:53 AM IST

ప్రభాస్.. 'సాహో' తర్వాత మరో చిత్రంలో నటించేందుకు సిద్ధమయ్యాడు. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతోంది. 'జాన్​' అనే టైటిల్​ పరిశీలనలో ఉన్నట్లు సమచారం. ఈ నెల 18 నుంచి హైదరాబాద్​లో కొత్త షెడ్యూల్ జరుపుకోనుంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఓ వార్త ఆసక్తి కలిగిస్తోంది.

'జాన్' కోసం 18వ శతాబ్దంలోని యూరప్​ను తలపించేలా ఖరీదైన 25 సెట్​ డిజైన్లు రూపొందించారట. ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్​సిటీ ఇందుకు వేదికైంది. ఇందులో ప్రభాస్-పూజా హెగ్డేల మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

డార్లింగ్ ప్రభాస్

ఈ సినిమాను యూవీ క్రియేషన్స్​తో కలిపి రెబల్​ స్టార్ కృష్ణంరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సుమారు రూ.180 కోట్ల బడ్జెట్​తో తీస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతమందిస్తున్నాడు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: 'జాన్' బాలీవుడ్​కు వెళ్లడా.. కారణం ఇదేనా..?

ABOUT THE AUTHOR

...view details