'కాంచన 3' సినిమాలో దెయ్యం పాత్రలో నటించిన మెప్పించిన రష్యన్ నటి అలెగ్జాండ్రా జావి అనుమానస్పద రీతిలో మృతి చెందింది. గోవాలో తాను అద్దెకు ఉంటున్న ఇంట్లోనే ఉరి వేసుకుని మరణించింది. అయితే ఆమెను ఎవరైనా చంపేసి, సూసైడ్లా చిత్రీకరించేందుకు ఇలా చేస్తున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Actress Death: 'కాంచన 3' నటి అనుమానాస్పద మృతి - అలెగ్రాండ్రా జావి మృతి
'కాంచన 3' సినిమాలో నటించి, మెప్పించిన రష్యన్ నటి మరణించింది. అయితే ఆమె మృతి అనుమానాస్పదంగా ఉందని భావించిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
అలెగ్జాండ్రా జావి
ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్‌తో జరిగిన గొడవ వల్ల ఆమె కొన్నిరోజుల నుంచి డిప్రెషన్‌తో బాధపడుతుందట. 2019లో చెన్నైకి చెందిన ఓ ఫొటోగ్రాఫర్ తనను శారీరకంగా వేధిస్తున్నాడంటూ ఈమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పుడు అతడిని అరెస్టు చేశారు. ఇప్పుడు అలెగ్రాండ్రా మరణంతో సదరు ఫొటోగ్రాఫర్‌ను మరోసారి ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి: