ప్రముఖ దర్శకురాలు బి.జయ తనయుడు శివకుమార్ దర్శకత్వం వహించనున్న తొలి చిత్రం '22'. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. హీరోలు విక్టరీ వెంకటేశ్, సాయితేజ్, దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు, ప్రముఖ నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, నవీన్ ఎర్నేని, అశ్వనీదత్, శ్యామ్‌ప్రసాద్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ చిత్రంలో రూపేశ్ కుమార్, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన విషయాల్ని పంచుకున్నాడు దర్శకుడు శివకుమార్.
"పూరీ జగన్నాథ్, వి.వి. వినాయక్‌ల స్ఫూర్తితోనే దర్శకుడిగా మీ ముందుకొస్తున్నా. వీరి వద్ద సహాయకుడిగా పనిచేశా. మా అమ్మ బి.జయ వద్ద దర్శకత్వ శాఖలో మెళకువలు నేర్చుకున్నా. దర్శకుడిగా నా తొలి చిత్రానికి హీరో వెంకటేశ్ క్లాప్ కొట్టడం చాలా సంతోషంగా ఉంది. మర్డర్ మిస్టరీ నేపథ్యంతో మిళితమైన పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ‘22’ సంఖ్యను టైటిల్‌గా పెట్టడం వెనుక ఓ ట్విస్ట్ ఉంది. అదేంటన్నది థియేటర్లో చూసి తెలుసుకోవాలి." -దర్శకుడు శివకుమార్