ఇస్మార్ట్ పూరీ చేతుల మీదుగా '22' ఫస్ట్‌లుక్ గ్లింప్స్ - పూరీ జగన్నాథ్-22 టీజర్
'22' సినిమా ఫస్ట్‌లుక్ గ్లింప్స్‌ను స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మంగళవారం విడుదల చేశాడు. ఈ సందర్భంగా చిత్రవిశేషాలను పంచుకుంది యూనిట్.
'22' సినిమా టీజర్ విడుదల చేస్తున్న దర్శకుడు పూరీ జగన్నాథ్
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ శిష్యుడు శివకుమార్ తీస్తున్న తొలి సినిమా '22'. రూపేష్ కుమార్ హీరోగా నటించాడు. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాత, పీఆర్వో బీఏ రాజు పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌లుక్ గ్లింప్స్‌ను దర్శకుడు పూరీ విడుదల చేశాడు. ఈ సందర్భంగా చిత్రబృందం.. '22' విశేషాలను వెల్లడించింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోందీ చిత్రం. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Last Updated : Jan 7, 2020, 6:40 PM IST