వన్‌ప్లస్ సంస్థ(oneplus movie mobile), ప్రముఖ దర్శకుడు విక్రమాదిత్య మోత్వానీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న సినిమా '2024'(2024 movie). ఈ ఫీచర్ ఫిల్మ్ నిడివి 60 నిమిషాలు. ఇందుకు సంబంధించిన ట్రైలర్ ఇటీవలే విడుదలైంది.
భారీ సాంకేతికతను ఉపయోగించి సినిమాలు తీస్తున్న ఈ కాలంలో.. ఒక్క స్మార్ట్తోనే చిత్రాన్ని తెరకెక్కించడమా? ఇదెలా సాధ్యం? పిక్చర్ క్వాలిటీ సరిగ్గా ఉండదేమో? అన్న సందేహాలు వస్తే.. సినిమా కోసం వినియోగిస్తున్న వన్‌ప్లస్ 9 ప్రో స్మార్ట్ ఫోన్లోని ప్రత్యేకతలు తెలుసుకోవాల్సిందే.
ఈ ఏడాది తొలిభాగంలో వన్‌ప్లస్ 9 ప్రోను సంస్థ విడుదల చేసింది. ఈ ఫోన్లో హాసెల్‌బ్లాడ్ కెమెరాలు ఉంటాయి. హాసెల్‌బ్లాడ్ అనేది కెమెరాలు, లెన్స్‌లు తయారు చేయడంలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సంస్థ. ఇక వన్‌ప్లస్ 9 ప్రోను 48ఎంపీ ఎఫ్/1.8 సోనీ ఐఎంఎక్స్689 సెన్సార్, 50ఎంప్ ఎఫ్/2.2 సోనీ ఐఎంఎక్స్766 అల్ట్రా వైడ్ సెన్సార్(ఫ్రీఫోం లెన్స్‌తో కలిపి), 2ఎంపీ మోనోక్రోమ్ లెన్స్‌తో రూపొందించారు. 8కే లిజల్యూషన్లో 30ఎఫ్‌పీఎస్(ఫ్రేమ్స్ పర్ సెకండ్) వరకు ఇందులో వీడియోలు రికార్డ్ చేయవచ్చు.