తెలంగాణ

telangana

ETV Bharat / sitara

2019 రౌండప్: పాట హిట్​.. సినిమా మాత్రం? - entertainment news

టాలీవుడ్​లో ఈ ఏడాది వచ్చిన కొన్ని సినిమాల్లో పాటలు హిట్​ అయినా, చిత్రం మాత్రం అనుకున్నంతగా ఆడలేదు. వాటి గురించే ఈ కథనం.

2019 రౌండప్: పాట హిట్​.. సినిమా ఫట్
2019లో పాటలు హిట్టయినా.. సినిమా ఫ్లాపయింది

By

Published : Dec 31, 2019, 1:17 PM IST

తెలుగు సినిమాలకు సంగీతమే ప్రాణం. కథ అంతంత మాత్రంగా ఉన్నా, వీటివల్లే కొన్ని చిత్రాలు హిట్​ అయిన సందర్భాలు ఉన్నాయి. 2019లో ఇందుకు భిన్నంగా జరిగింది. కొన్ని సినిమాల్లో కొన్ని పాటలు సూపర్​ హిట్​గా నిలిచాయి. బొమ్మ మాత్రం ఆదరణ దక్కించుకోలేకపోయింది.​ సంగీత ప్రియుల్ని ఆకట్టుకున్నంతగా, ప్రేక్షకులను అలరించలేకపోయాయి. ఇంతకీ ఆ సినిమాలేంటి? అందులోని పాటలేంటో చూసేద్దామా.

డియర్ కామ్రేడ్- 'నీ నీలి కన్నుల్లోని ఆకాశమే'

విజయ్ దేవరకొండ-రష్మిక జోడీ.. 'నీ నీలి కన్నుల్లోని ఆకాశమే', 'ఎటు పోనే' వంటి అద్భుతమైన గీతాలు.. 'డియర్ కామ్రేడ్​' సినిమాకు హైప్​ తీసుకొచ్చాయి. దక్షిణాదిలోని నాలుగు భాషల్లో విడుదల చేశారు. పాటలు ఆకట్టుకున్నంతగా, సినిమా ఆడలేదు.

ఏబీసీడీ-'మెల్ల మెల్ల మెల్లగా'

ఇందులో సిద్ శ్రీరామ్ పాడిన 'మెల్ల మెల్ల మెల్లగా' పాట.. శ్రోతల మనసు దోచింది. ఈ వీడియోలో హీరోయిన్ రుక్సార్ థిల్లాన్ అందం.. అభిమానులను కట్టిపడేసింది. ఇవేవి సినిమాకు ప్లస్​ కాలేకపోయాయి

గుణ 369- 'బుజ్జి బంగారం'

కార్తికేయ నటించిన ఈ సినిమాలో 'నా బంగారం.. బుజ్జి బుజ్జి బంగారం' పాట.. చిత్రం రాకముందే పాపులర్​ అయింది. ఈ హీరో.. మరో హిట్​ కొట్టేలా ఉన్నాడనిపించింది. తీరా సినిమా విడుదలయ్యాక పాట బాగున్నా, బాక్సాఫీస్​ వద్ద బోల్తా కొట్టిందీ సినిమా.

వినయ విధేయ రామ- 'ఏక్ బార్ ఏక్ బార్'

ఈ సినిమాలో రామ్​చరణ్-కియారా అడ్వాణీ జంటగా నటించారు. పార్టీ మూడ్​లో వచ్చే ఈ గీతంలో రామ్​చరణ్​ స్టెప్పులు, మాస్​ బీట్​ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కానీ రొటీన్ కథాంశం వల్ల డిజాస్టర్​గా నిలిచిందీ చిత్రం.

దొరసాని- 'నింగిలోన పాలపుంత'​

హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్.. కథానాయకుడు రాజశేఖర్​ కూతురు శివాత్మిక.. 'దొరసాని'తో వెండితెరకు పరిచయమయ్యారు. గ్రామీణ ప్రేమకథలో పాటలు కొన్ని ఆకట్టుకున్నా, సినిమా మాత్రం అనుకున్నంత మేర ఆడలేదు.

మిస్టర్ మజ్ను- 'కోపంగా కోపంగా'

అక్కినేని అఖిల్- నిధి అగర్వాల్.. ఇందులో జోడీగా నటించారు. సినిమా కథలో బలం లేకపోవడం వల్ల, ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

ఇవీ చదవండి:

రివ్యూ 2019: తెలుగు సినిమాకు అత్తెసరు మార్కులే

రివ్యూ 2019: చెలరేగిన చిన్న సినిమాలు.. మెప్పించిన మల్టీస్టారర్లు

2020 ప్రివ్యూ: ఇవి క్రేజీ క్రేజీ బయోపిక్​లు

రివ్యూ 2019: హాట్​ సీన్లు, ఘాటు ముద్దులకు ప్రేక్షకులు నో!

ABOUT THE AUTHOR

...view details