తెలంగాణ

telangana

Prabhas-Nag ashwin: కేవలం రెమ్యునరేషన్ రూ.200 కోట్లు!

By

Published : May 29, 2021, 7:31 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్​తో చేయబోయే చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయం వైరల్​గా మారింది. ఇంతకీ అదెంటంటే?

200 crores Just remuneration of actors in Prabhas next?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్

'బాహుబలి' తర్వాత డార్లింగ్ ప్రభాస్ సినిమా అంటే వందల కోట్లతో నిర్మాణమే. ప్రస్తుతం అతడు నటిస్తున్న 'సలార్', 'ఆదిపురుష్', 'రాధేశ్యామ్' అలాంటి చిత్రాలే. అయితే వీటి తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్.. మరింత భారీ బడ్జెట్​తో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఓ విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.

ప్రభాస్ దీపికా పదుకొణె

ఈ సినిమాలో ప్రభాస్​తో పాటు దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్ తదితరులు నటిస్తున్నారు. అయితే కేవలం నటీనటులకు ఇచ్చే రెమ్యునరేషన్ రూ.200 కోట్లు అని టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఇంకా గ్రాఫిక్స్, ఇతరత్రా మొత్తం కలిపితే భారీ బడ్జెట్​ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ప్రాజెక్టు ఈ ఏడాది చివర్లో లేదంటే వచ్చే సంవత్సరం మొదట్లో ప్రారంభమవొచ్చు.

ఇది చదవండి:ప్రభాస్​-నాగ్​అశ్విన్​ సినిమా స్టోరీలైన్​ లీక్​!

ABOUT THE AUTHOR

...view details