ఒకప్పుడు సినిమా పాట అంటే ఏడెనిమిది నిమిషాల నిడివిలో ఉండేది. ఆ తర్వాత అది అలా అలా ఐదు నిమిషాలకు వచ్చింది. ఇప్పుడొస్తున్న పాటలైతే మూడు నుంచి నాలుగు నిమిషాలే ఉంటున్నాయి. అయితే ఇప్పటి వరకు హిందీ సినిమాల్లో ఎక్కువ నిడివి ఉన్న పాటేంటో తెలుసా? 2004లో వచ్చిన 'అబ్ తుమ్హారే హవాలే వాటన్ సాతియా' సినిమాలోని టైటిల్ సాంగ్.
సినిమా చరిత్రలోనే ఇది అతిపెద్ద పాట! - అబ్ తుమ్హారే హవాలే వాటన్ సాతియా
సినిమాల్లో పాట అంటే మహా అయితే నాలుగైదు నిమిషాలు ఉంటుంది. కానీ, 2004లో వచ్చిన ఓ హిందీ మూవీలోని సాంగ్ ఏకంగా 20 నిమిషాల నిడివి ఉంది. మరి ఆ సినిమా ఏంటి? ఆ పాటేంటో తెలుసుకోండి.
అబ్ తుమ్హారే హవాలే వాటన్ సాతియా
20 నిమిషాల నిడివి ఉండే ఈ పాట సినిమాలో మూడు విడతల్లో ఉంటుంది. అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, బాబీ దేఓల్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రంలో కీలక సమయాల్లో ఈ పాట వస్తుంది. అను మాలిక్ సంగీతమందించిన ఈ మూవీలోని గీతాలు అప్పట్లో విశేష ఆదరణ పొందాయి.
ఇదీ చదవండి:యువనటి అరెస్టు.. ఆ వీడియోనే కారణం