బాలీవుడ్ నటీనటుల్లో ప్రేమించుకొని పెళ్లి చేసుకొంటున్న వారిని ఇటీవలి కాలంలో చాలా మందినే చూస్తున్నాం. అయితే గతంలో జెనీలియా కూడా ఇదే తరహాలో నటుడు రితేశ్ దేశ్‌ముఖ్‌ను వివాహమాడింది. వారిద్దరి మధ్య ప్రేమకు కారణం 'తుజే మేరి కసమ్' చిత్రమట. తాజాగా వారి పెళ్లిరోజున ఓ పోస్టు ద్వారా ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది జెన్నీ. " ఇది నా మొదటి చిత్రం నా హృదయాన్ని కదిలించింది" అనే ట్యాగ్‌లైన్‌తో వీడియోను షేర్ చేసింది.
17 ఏళ్ల క్రితం ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను... ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు నిర్మించారు. కె.విజయ్ భాస్కర్ దర్శకుడు. 2003లో జనవరి 3వ తేదీన విడుదలై మంచి ఫలితాన్నే రాబట్టిందీ చిత్రం.