హాలీవుడ్ నటుడు 'ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్' ఫేమ్ అన్సల్ ఎల్గార్ట్పై ఓ అమ్మాయి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. 17 ఏళ్లు నిండని తనపై ఎల్గార్ట్ లైంగిక దాడి చేశాడని సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది.
" అభిమానంతో ఎల్గార్ట్ను కలవడానికి వెళ్లాను. కానీ అతడు నాతో అసభ్యంగా ప్రవర్తించి నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అప్పుడు నా వయసు 17 ఏళ్లు కూడా నిండలేదు. అతడు మాత్రం 20ల్లో ఉన్నాడు. నన్ను లైంగికంగా ఇబ్బంది పెట్టాడు. నేనేమి ఫేమస్ అవ్వాలని ఇదంతా చెప్పట్లేదు. అతడి వల్ల మానసికంగా క్షోభ అనుభవించా. ఆ తర్వాత కొన్ని నెలల పాటు చికిత్స పొంది కోలుకున్నాను. నాలోని బాధ చెప్పుకోడానికే ఈ విషయం బహిర్గతం చేస్తున్నా. నాలాగే చాలా మంది అమ్మాయిలు అతడి బాధితులుగా ఉన్నారు"
-- ఓ యువతి