తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కాజల్‌ 'కల్యాణం' @ 14 ఏళ్లు - లక్ష్మి కల్యాణం

ఏంటీ 14 సంవత్సరాలా? కాజల్‌ అగర్వాల్‌ పెళ్లి ఇటీవలే కదా జరిగింది.. అనుకుంటున్నారా! మీ సందేహానికి సమాధానం దొరకాలంటే ఇది చదవండి.

14 years for kajal agarwal in tfi
కాజల్‌ 'కల్యాణం' @ 14 ఏళ్లు

By

Published : Feb 14, 2021, 9:46 PM IST

కాజల్‌ నటించిన తొలి చిత్రం 'క్యూన్‌! హో గయా నా'. అమితాబ్‌ బచ్చన్‌, వివేక్‌ ఒబెరాయ్‌, ఐశ్వర్యరాయ్‌ ప్రధాన పాత్రధారులుగా వచ్చిందా సినిమా. అందులో ఐశ్వర్య సోదరిగా కనిపించింది కాజల్‌. ఆ తర్వాత 'లక్ష్మీ కల్యాణం' సినిమాతో కథానాయికగా తన ప్రస్థానం మొదలుపెట్టింది. కల్యాణ్‌ రామ్‌ హీరోగా ప్రముఖ దర్శకుడు తేజ తెరకెక్కించారు. ఇందులో లక్ష్మీ అనే పల్లెటూరి అమ్మాయిగా తన సహజమైన నటన, అందంతో తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. కొత్త నాయిక అనే భావన రానీకుండా ఎంతో పరిణితి చూపింది. ఈ సినిమా చూశాక పెళ్లి కూతురు గెటప్‌లో ఇతర నాయికలంటే కాజలే బావుంటుంది ప్రశంసలు కురిపించిన వారెందరో ఉన్నారు. ఇప్పటికీ ఆ ఫొటోలు వాల్‌ పేపర్‌గా నిలిచిన ఫోన్లు ఎన్నో ఉన్నాయి. పతాక సన్నివేశంలో పెళ్లి మండపంలో కాజల్‌ చెప్పే ఎమోషనల్‌ డైలాగ్స్‌ ఎప్పటికీ ప్రత్యేకమే. 2007 ఫిబ్రవరి 15న విడుదలైందా చిత్రం. అంటే 'లక్ష్మీ కల్యాణం' విడుదలై నేటికి 14 ఏళ్లు. ఇదీ సంగతి.

భర్తతో కాజల్

తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించిన కాజల్‌ వరుస అవకాశాలు అందుకుంటూ అనతి కాలంలోనే అగ్ర కథానాయికగా మారింది. 'చందమామ'నే ఇంటిపేరుగా మార్చుకుంది. 'మగధీర', 'డార్లింగ్‌', 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌', 'బిజినెస్‌మేన్‌', 'టెంపర్‌', 'నేనే రాజు నేనే మంత్రి' తదితర హిట్‌ చిత్రాలెన్నో తన ఖాతాలో వేసుకుంది. నటిగా ఇన్నేళ్లు పూర్తిచేసినా, వివాహం చేసుకున్నా తన జోరు తగ్గలేదని నిరూపిస్తూనే ఉంది. ప్రస్తుతం చిరంజీవి సరసన 'ఆచార్య'లో నటిస్తుంది. మంచు విష్ణుతో నటించిన 'మోసగాళ్లు' విడుదలకు సిద్ధంగా ఉంది.

ఇదీ చూడండి:తాప్సీ ముచ్చటగా మూడు.. మ్యూజిక్​ వీడియోలో ఊర్వశీ

ABOUT THE AUTHOR

...view details