తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సరికొత్త రికార్డును సెట్​ చేసిన 'సారంగదరియా'! - నాగచైతన్య సాయిపల్లవి

'సారంగదరియా' లిరికల్​ వీడియో యూట్యూబ్​లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. అతితక్కువ సమయంలోనే 100 మిలియన్​ వ్యూస్​ దక్కించుకున్న తొలి దక్షిణాది పాటగా సరికొత్త రికార్డు నెలకొల్పింది.

SARANGADARIYA_SONG_100_MILLIONS
సారంగదరియాకు 100 మిలియన్ల వీక్షణలు

By

Published : Apr 1, 2021, 3:16 PM IST

Updated : Apr 1, 2021, 3:32 PM IST

'లవ్​స్టోరి' సినిమా నుంచి ఇటీవలే విడుదలైన 'సారంగదరియా' పాట యూట్యూబ్​లో సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ పాటకు ఇప్పటివరకు 100 మిలియన్లకు పైగా వీక్షణలను దక్కించుకుంది. అయితే దక్షిణాదిలో అతి తక్కువ సమయంలో (32 రోజుల్లోనే) 100 మిలియన్ వ్యూస్ సాధించిన పాటగా 'సారంగదరియా' రికార్డు నెలకొల్పింది.

సారంగదరియాకు 100 మిలియన్ల వీక్షణలు

ఈ పాటను సుద్దాల అశోక్​ తేజ రచించగా.. పవన్​ సీహెచ్​ స్వరాలు సమకూర్చారు. శేఖర్​ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన సినిమాలో అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించారు. ఏప్రిల్​ 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

ఇదీ చూడండి:రామ్​చరణ్​-శంకర్​ సినిమాకు అనుకోని బ్రేక్​!

Last Updated : Apr 1, 2021, 3:32 PM IST

ABOUT THE AUTHOR

...view details