తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'రాములో రాముల' పాటతో బన్నీ మరో సెంచరీ - 'అల వైకుంఠపురములో' సినిమాలోని 'రాములో రాముల' లిరికల్​ గీతం

'అల వైకుంఠపురములో' సినిమాలోని 'రాములో రాముల' లిరికల్​ గీతం 100 మిలియన్ వీక్షణలు సాధించింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న రానుందీ చిత్రం.

'రాములో రాముల' పాటతో బన్నీ మరో సెంచరీ
'అల వైకుంఠపురములో' సినిమాలోని 'రాములో రాముల' లిరికల్​ గీతం

By

Published : Dec 18, 2019, 5:41 PM IST

స్టైలిష్​ స్టార్ అల్లు అర్జున్ మరో సెంచరీ కొట్టాడు. అల వైకుంఠపురములో సినిమాలో రాములో రాముల లిరికల్ పాట 100 మిలియన్​ వ్యూస్​ సాధించింది. ఈ విషయాన్ని చెబుతూ కొత్త పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం. 'సామజవరగమన' గీతం ఇప్పటికే 100 మిలియన్​ వీక్షణలు సాధించడం విశేషం. ఇలా రెండు పాటలతో ఈ ఘనత సాధించిన తొలి దక్షిణాది హీరోగా నిలిచాడు బన్నీ.

100 మిలియన్ వ్యూస్​ సాధించిన సామజమవరగమన పాట

ఈ సినిమాలో హీరోయిన్​గా పూజా హెగ్డే నటిస్తోంది. సుశాంత్, నవదీప్, నివేదా పేతురాజ్, టబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమన్ సంగీతమందించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్​ నిర్మించింది. సంక్రాంతి కానుకగా వచ్చే నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: 'సామజవరగమన'.. యూట్యూబ్​లో లైకుల రికార్డు

ABOUT THE AUTHOR

...view details